Paytm | పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ప్రెసిడెంట్, సీఓఓ భావేష్ గుప్తా తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. భావేష్ కంపెనీలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ చెల్లింపులు, లోన్ వ్యాపారంతో సహా తదితర విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో ఆయన తన పదవికి రాజీనామా చేశారని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. మే 31న ఆయన కంపెనీ సేవల నుంచి రిలీవ్ కానున్నారు. అయితే, ఈ ఏడాది చివరి వరకు కంపెనీలో సలహాదారుగా కొసాగుతారు. భావేష్ 2020 ఆగస్టులో పేటీఎంలో చేరారు. ఇదిలా ఉండగా.. కంపెనీ నాయకత్వ బృందాన్ని మరింత విస్తరించనున్నట్లు వన్ 97 కమ్యూనికేషన్ లిమిటెడ్ వెల్లడించింది.
పేటీఎం సీఈవో, సీనియర్ మేనేజ్‌మెంట్‌తో నేరుగా పని చేసేందుకు కంపెనీ తన నాయకత్వ బృందాన్ని విస్తరించింది. పేటీఎం చెల్లింపులు, క్రెడిట్ వ్యాపారులకు నాయకత్వం వహించే ఎగ్జిక్యూటివ్‌లు ఒక్కొక్కరు పేటీఎంలో ఐదేళ్లకంటే ఎక్కువ అనుభవం కలిగి ఉన్నారని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. అనుభవజ్ఞులైన ఈ నాయకత్వ బృందం ఇప్పుడు నేరుగా పీటీఎం సీఈవో కలిసి పని చేస్తుంది. కంపెనీ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ భావేష్ గుప్తా వ్యక్తిగత కారణాలతో తన కెరీర్ నుంచి విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నారని కంపెనీ చేసింది. అయితే, ఆయన సలహాదారు పాత్రలో కొనసాగుతారని చెప్పింది.
ఇదిలా ఉండగా.. ఇటీవల పేటీఎం మనీ లిమిటెడ్ (PML) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా రాకేశ్ సింగ్ నియమితులయ్యారు. ఇంతకుముందు, రాకేశ్ సింగ్ ఫిస్‌డమ్‌లో స్టాక్ బ్రోకింగ్ వ్యాపారానికి సీఈఓగా ఉన్నారు. ఆయన ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అండ్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌లో కీలకమైన మేనేజ్‌మెంట్ పదవుల్లో పనిచేశారు. పేటీఎం మనీ లిమిటెడ్ మాజీ హెడ్ వరుణ్ శ్రీధర్ ఇప్పుడు పీఎస్‌పీఎల్‌కు సీఈవోగా నాయకత్వం వహిస్తున్నారని కంపెనీ తెలిపింది. పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ చెల్లింపులు, రుణాలపై కంపెనీ దృష్టి గతంలో కంటే బలంగా ఉందని తెలిపారు.