Monday, December 30, 2024
HomeCinemaJr Ntr|మీరు నా బొచ్చు కూడా పీక‌లేరు అంటూ ఎన్టీఆర్ అభిమానుల‌కి నంద‌మూరి హీరో వార్నింగ్

Jr Ntr|మీరు నా బొచ్చు కూడా పీక‌లేరు అంటూ ఎన్టీఆర్ అభిమానుల‌కి నంద‌మూరి హీరో వార్నింగ్

Jr Ntr| నంద‌మూరి ఫ్యామిలీకి, జూనియ‌ర్ ఎన్టీఆర్‌కి కొంత కాలంగా దూరం పెరిగింద‌నే చెప్పాలి. ముఖ్యంగా బాల‌య్య‌, ఎన్టీఆర్ మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తుంద‌నే టాక్ కూడా ఉంది. కొద్ది రోజుల క్రితం సీనియ‌ర్ ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా ఎన్టీఆర్ గార్డెన్స్ వ‌ద్ద జూనియ‌ర్ ఎన్టీఆర్ బ్యాన‌ర్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని పీకి ప‌డేయండి అంటూ బాల‌య్య చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇక ఇప్పుడు నంద‌మూరి ఫ్యామిలీ నుండి వ‌చ్చిన మ‌రో హీరో చైతన్య కృష్ణ బహిరంగంగా జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను హెచ్చరించడం హాట్ టాపిక్‌గా మారింది.

నంద‌మూరి చైతన్య కృష్ణ మాట‌లాడుతూ.. “జూ ఎన్టీఆర్ అభిమానులకి ఇదే నా వార్నింగ్. వైసీపీకి అందులోనూ ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీకి మద్దతు ఇచ్చిన జూ ఎన్టీఆర్ అభిమానులకి నేను చెప్పేది ఏంటంటే.. మీరు వైసీపీకి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు తెలిపారు. అయిన కూడా మీరు ఎవ‌రు మా బొచ్చు కూడా పీక‌లేరు. నేను ఉండగా చంద్రబాబు నాయుడు మావయ్య, నందమూరి బాలకృష్ణ బాబాయ్‌లను టచ్ చేసే వాడే లేడు. నా సినిమా రిలీజ్ అయిన‌ప్పుడు జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ , వైసీపీ కలిసి నన్ను బాగా ట్రోల్ చేశారు. జాగ్రత్తగా ఉండండి” అంటూ చైతన్య కృష్ణ హెచ్చరించారు.

నంద‌మూరి చైత‌న్య కృష్ణ ఫేస్ బుక్ లో పెట్టిన ఈ పోస్ట్‌పై జూ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నిక‌ల త‌ర్వాత ఇలాంటి పోస్ట్ పెట్ట‌డమేంటి, అయిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌ని ఎందుకు ఇందులోకి లాగుతున్నారు అంటూ కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయిన ఈ పోస్ట్ ఎన్నిక‌ల‌కి ముందు పెట్టి ఉంటే జూనియ‌ర్ ఎన్టీఆర్ ప‌వ‌ర్ ఏంటో తెలిసి ఉండేద‌ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయ‌న అంత సీరియ‌స్‌గా పెట్టాల్సిన అవ‌స‌రం ఏమోచ్చింది అని కూడా కొంద‌రు ఆలోచ‌న‌లు చేస్తున్నారు. కాగా, నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ అనే విష‌యం తెలిసిందే.

RELATED ARTICLES

తాజా వార్తలు