SBI ఛైర్మన్ చల్లా నియామకానికి ఏసీసీ ఆమోదం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకానికి కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదం తెలిపింది.
మూడు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ నెల 28న రిటైర్ కానున్న దినేశ్ కుమార్ స్థానంలో ఆయన నియమితులయ్యారు.
చల్లా స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా లోని పెద్ద పోతులపాడు గ్రామం..