Chandrababu | గుంటూరు : టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంద్రబాబు కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మరిచిపోలేనిది. అమెరికా, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చి ఓటు వేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని, తమ భవిష్యత్‌ను ప్రజలు కాపాడుకోవాలనుకుంటున్నారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి. భవిష్యత్‌ను తీర్చిదిద్దేది ఎన్నికలే అని ప్రజలు గుర్తించారు. పలు జిల్లాల్లో వైసీపీ అరాచకం కొనసాగుతోంది. రౌడీయిజం, గూండాయిజంతో రెచ్చిపోతే ఊరుకునేది లేదు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, ఈసీ బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఎన్ని సీట్లు టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి గెలుస్తుందన్న ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు పోలింగ్ కొనసాగుతోంది.. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేను అని పేర్కొన్నారు.
#WATCH | Former Andhra Pradesh CM and TDP chief N Chandrababu Naidu casts his vote at a polling booth in Guntur.
Voting for Andhra Pradesh Assembly elections and the fourth phase of #LokSabhaElections2024 are taking place simultaneously today. pic.twitter.com/479qjWy7xo
— ANI (@ANI) May 13, 2024