Chandrababu | కోడికత్తి, గులకరాయి ఏపీ సీఎం జగన్ నాటకాలు అని, ఆ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు పేర్కొన్నారు. అబద్ధాలు చెప్పి ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తారని చంద్రబాబు నిలదీశారు. నంద్యాల జిల్లా పాణ్యం ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.
సైకో జగన్‌ను నమ్మి మరోసారి మోసపోవద్దు అని బాబు సూచించారు. మీ కోపాన్ని, ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించాలన్నారు. 13వ తేదీన వైఎస్సార్‌సీపీని చిత్తుచిత్తుగా ఓడించాలి. జగన్ పార్టీని భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ ఐదేండ్లలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేని అసమర్థుడు జగన్ అని మండిపడ్డారు. జగన్ అహంకారి, సైకో, విధ్వంసకారుడు, దోపిడీదారుడు. రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ జగన్ సర్వనాశనం చేశారు. వాళ్లు చెప్పిందే చేయాలి.. లేకపోతే దాడి చేసి చంపేస్తారు అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్నారు. అధికారంలో మూడు రాజధానుల నాటకమాడారు. మూడు రాజధానులు కాదు.. ఒక్క రాజధాని అయినా కట్టారా..? ఐదేండ్లు పరదాలు కట్టుకుని తిరిగారు. ఇవాళ జనం ముందుకు వచ్చి అబద్ధాలు చెబుతున్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.