అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. చంద్రబాబు చేత ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణా జిల్లాలోని కేసరిపల్లిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, సినీ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్ దంపతులు, రామ్‌చరణ్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో పలువురు నేతలు హాజరయ్యారు.
24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో 17 మంది కొత్తవారే. ముగ్గురు మహిళలకు చోటు లభించింది. బీసీలు ఎనిమిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనార్టీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం వరించింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం దక్కింది.
మంత్రులు వీరే..
1. పవన్ కల్యాణ్(జనసేన)
2. నారా లోకేశ్(టీడీపీ)
3. అచ్చెన్నాయుడు (టీడీపీ)
4. కొల్లు రవీంద్ర(టీడీపీ)
5. నాదెండ్ల మనోహర్(జనసేన)
6. పి. నారాయణ(టీడీపీ)
7. వంగలపూడి అనిత(టీడీపీ)
8. సత్యకుమార్ యాదవ్(బీజేపీ)\
9. నిమ్మల రామానాయుడు(టీడీపీ)
10. ఎన్ ఎండీ ఫరూక్(టీడీపీ)
11. ఆనం రామనారాయణరెడ్డి(టీడీపీ)
12. పయ్యావుల కేశవ్(టీడీపీ)
13. అనగాని సత్యప్రసాద్(టీడీపీ)
14. కొలుసు పార్థసారథి(టీడీపీ)
15. బాల వీరాంజనేయ స్వామి(టీడీపీ)
16. గొట్టిపాటి రవి(టీడీపీ)
17. కందుల దుర్గేశ్(జనసేన)
18. గుమ్మిడి సంధ్యారాణి(టీడీపీ)
19. బీసీ జనార్ధన్ రెడ్డి (టీడీపీ)
20. టీజీ భరత్(టీడీపీ)
21. ఎస్ సవిత(టీడీపీ)
22. వాసంశెట్టి సుభాష్(టీడీపీ)
23. కొండపల్లి శ్రీనివాస్(టీడీపీ)
24. మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి(టీడీపీ)