Chandrakanth| ఐదు రోజుల క్రితం త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడం మనం చూశాం. ఆమె మరణ వార్త మరచిపోక ముందే ఆమెతో సీరియల్‌లో నటించి ప్రియుడిగా మారిన చంద్రకాంత్ బలవన్మరణానికి పాల్పడ్డారు. పవిత్ర మృతి చెందినప్పటి నుండి తీవ్ర డిప్రెషన్‌లో ఉన్న చంద్రకాంత్ శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. రెండు రోజు క్రితం పవిత్ర పుట్టిన రోజు కాగా .. ఈ సందర్భంగా ‘రెండు రోజులు ఆగు..’ అంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు. దీంతో అందరు ఆందోళన చెందారు. ఆయనకి ధైర్యం అందించారు. అయినప్పటికీ తాను పవిత్ర దగ్గరకు వెళ్లాలని నిశ్చయించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే చంద్రకాంత్ 2015 లో శిల్పా ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.వీరికి ఇద్దరు పిల్లలు. ఆమెని మొదట్లో చంద్రకాంత్ బాగా చూసుకున్నాడట. అయితే త్రినయని సీరియల్‌లో పవిత్రతో ఆయనకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ప్రతిరోజూ తాగి వచ్చి నన్ను చిత్రహింసలకు గురి చేసేవాడు. ఇంటి గురించి పట్టించుకోవడం మానేశాడు.. మా అత్తయ్య ఎంత చెప్పినప్పటికీ వినేవాడు కాదు. ఇక పవిత్ర జయరాం నాకు ఫోన్ చేసి చంద్ర కాంత్ నా భర్త నువ్వు మర్చిపో.. అంటూ బెదిరించేది. ఒకసారి ఆమె కొడుకుకి ఈ విషయం చెబితే వారి లైఫ్ వారి ఇష్టం. మాకు దానితో సంబంధం లేదని సమాధానం చెప్పాడు అని చంద్రకాంత్ భార్య శిల్ప పేర్కొంది.
పవిత్ర జయరామ్ వచ్చిన తర్వాత నన్ను చిత్రహింసలకు గురి చేస్తూ వచ్చాడు. సోషల్ మాద్యమాల్లో నన్ను బ్లాక్ చేశాడు. పవిత్రకు రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత బెడ్ పై పడుకొని ట్రీట్ మెంట్ తీసుకుంటూ మా ముందే పవిత్ర గురించి ఏడ్చుకుంటూ చాలా బాధ పడేవాడు. అయితే ఏ రోజైన మారి మా దగ్గరకు వస్తాడేమో అనుకున్నా. కాని పవిత్ర కోసం నా జీవితం మొత్తం నాశనం చేశాడు’ అంటూ శిల్ప ఎమోషనల్ అయ్యింది.