Chicken Price | మాంసహార ప్రియులకు చికెన్ ధరలు షాక్ ఇస్తున్నాయి. ఇటీవల ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత వారంలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ.250 నుంచి రూ.280 వరకు ఉండేది. ప్రస్తుతం చికెన్ ధర కిలోకు రూ.300కి చేరింది. మరో రెండువారాలు ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని చికెన్ వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇప్పుడు అది ఏకంగా రూ. 300కు చేరుకుంది. మరో 15 రోజుల చికెన్ ధర ఇలాగే ఉంటుందని వ్యాపారులు చెపుతున్నారు. ఎండలు, వాతావరణంలో మార్పుల కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గిందని… కోళ్ల దాణా, రవాణా ఖర్చులు కూడా పెరిగాయని తెలిపారు. జూన్ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా.. చికెన్ ధరల పెరుగుదలతో అమ్మకాలు పడిపోయాయి. బిజినెస్ తగ్గడంతో చికెన్ రీటైల్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రోజు 30-40 కిలోల వరకు విక్రయించే వారమని.. ప్రస్తుతం పది కిలోల వరకు కూడా అమ్మడం లేదని ఓ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు.