Sunday, December 29, 2024
HomeCinemaChiranjeevi| ఓటు వేసిన మెగాస్టార్.. ప్ర‌జ‌లంద‌రు త‌ప్ప‌నిస‌రిగా ఓటు వేయాలంటూ చిరంజీవి పిలుపు

Chiranjeevi| ఓటు వేసిన మెగాస్టార్.. ప్ర‌జ‌లంద‌రు త‌ప్ప‌నిస‌రిగా ఓటు వేయాలంటూ చిరంజీవి పిలుపు

Chiranjeevi| ఈ రోజు ఎల‌క్ష‌న్ డే కావ‌డంతో ప్ర‌జ‌లంద‌రు కూడా త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్‌ల‌కి వెళుతున్నారు. సామాన్యులు, సెల‌బ్రిటీలు, ప‌లువురు ప్ర‌ముఖులు లైన్స్‌లో నిలుచొని మ‌రీ ఓటు వేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం త‌న ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన త‌ర్వాత మీడియాతో మాట్లాడిన ఆయ‌న ఓటు వేయ‌డం అనేది మ‌న హ‌క్కే కాదు, మ‌న బాధ్య‌త‌. ప్ర‌తి ఒక్క‌రు ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డం వ‌ల‌న స‌రైన నాయ‌కులు వ‌స్తారు, స‌రైన ప్ర‌భుత్వాలు వ‌స్తాయి, సరైన అభివృద్ధి జ‌రుగుతుంద‌ని అన్నారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి అడ‌గ‌గా, ఇక దాని గురించి ఏమి మాట్లాడ‌ని అన్నారు.

పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం కోసం వదిన సురేఖ, ఆమె కుమారుడు రామ్ చరణ్ అక్క‌డికి వెళ్ల‌డం మ‌నం చూశాం. చిరంజీవి కూడా చివరి రోజు వెళ‌తారిని అంద‌రు భావించినా ఆయన మాత్రం వెనక్కి తగ్గారు. పిఠాపురంకి తాను వెళ్తున్నాన‌ని మీడియా మాత్ర‌మే ప్ర‌చారం చేసింది. తాను పిఠాపురంలో పోటీ చేస్తున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఓటేయాలని వీడియో విడుదల చేసిన‌ట్టు తెలియ‌జేశారు. తాను రాజకీయాలకు అతీతంగా ఉండాలనుకుంటున్నట్లు చిరంజీవి తెలియ‌జేసిన విష‌యం తెలిసిందే.

 

 

RELATED ARTICLES

తాజా వార్తలు