Monday, December 30, 2024
HomeCinemaChiranjeevi| రామ్ చ‌ర‌ణ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌లో ఏవంటే బాగా ఇష్ట‌మో చెప్పిన చిరంజీవి

Chiranjeevi| రామ్ చ‌ర‌ణ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌లో ఏవంటే బాగా ఇష్ట‌మో చెప్పిన చిరంజీవి

Chiranjeevi| టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నిన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్న విష‌యం తెలిసిందే. సినీ రంగానికి నాలుగు ద‌శాబ్ధాలుగా ఆయ‌న చేసిన సేవ‌ల‌ని గుర్తించిన కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ విభూష‌ణ్ అవార్డ్ ఇచ్చి స‌త్క‌రించింది. ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో చిరంజీవితో పాటు ఆయ‌న భార్య సురేఖ‌, కూతురు సుస్మిత‌, రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న లు కూడా పాల్గొని సంద‌డి చేశారు.అయితే చిరంజీవికి అత్యున్న‌త అవార్డ్ ద‌క్క‌డం ప‌ట్ల ప్ర‌తి ఒక్కరు సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే ఏకంగా చిరంజీవిని క‌లిసి ప్రత్యేకంగా అభినందించారు.

ఆ సందర్భంగా ఇరువురు సినిమాలు, రాజకీయాలు ఇతర విషయాల గురించి ఇద్ద‌రు చాలా సేపు ముచ్చ‌టించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. కిషన్ రెడ్డితో చిట్‌ చాట్ స‌మ‌యంలో సినిమాల ప్ర‌స్తావ‌న రాగా, చిరంజీవి త‌న‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ,రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఏయే సినిమాలు అంటే చాలా ఇష్ట‌మో తెలియ‌జేశారు. ప‌వ‌న్ నటించిన తొలి ప్రేమ, తమ్ముడు, జల్సా అంటే చాలా ఇష్టం అని అన్నారు. జ‌ల్సా సినిమాను తాను చాలా ఎంజాయ్ చేస్తానంటూ కూడా పేర్కొన్నారు. ఇక రామ్ చ‌ర‌ణ్ సినిమాల‌లో మ‌గ‌ధీర చిత్రం త‌న‌కు బాగా న‌చ్చుతుంద‌ని తెలియ‌జేశారు. సినిమాల‌లో ప‌వ‌న్ , రామ్ చ‌ర‌ణ్ మంచి విజ‌యాలు సాధించ‌డం త‌న‌కు ఎంతో సంతోషాన్ని ఇస్తుంద‌ని అన్నారు చిరంజీవి.

ఇక రామ్ చరణ్‌ మరియు పవన్ కళ్యాణ్ లతో తనకు మంచి సాన్నిహిత్యం ఉంద‌ని ఈ సంద‌ర్భంగా కిషన్ రెడ్డి అన్నారు.ఇక చిరంజీవి ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కి చాలా దూరంగా ఉన్నారు. కాని త‌మ్ముడి కోసం ప్ర‌చారం చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కు మద్దతుగా చివరి నిమిషంలో ప్రచారం చేయ‌నున్న‌ట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. చంద్రబాబుతోనూ భేటీ అయి వాస్తవ పరిస్ధితులపై చర్చించనున్నార‌న అంటున్నారు. దీనిపై పూర్తి క్లారిటీ అయితే రావ‌ల‌సి ఉంది. ఇక చిరంజీవి సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం వ‌శిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి విశ్వంభర సినిమాను చేస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత చిరు చేస్తున్న సోషియో ఫాంటసీ కావ‌డంతో మూవీపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి.. 2025 సంక్రాంతికి ఈ సినిమా థియేట‌ర్స్‌లోకి రానుంది.

RELATED ARTICLES

తాజా వార్తలు