Chiranjeevi| మెగాస్టార్ చిరంజీవి వివాద రహితుడు. ఆయన అజాత శత్రువు. ఎవరి జోలికి పోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతుంటారు. ఆరుపదుల వయసు దాటినా కూడా ఇంకా అదే ఎనర్జీతో సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు.వెండితెరపై మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా ఆయన రియల్ హీరోనే. ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొని నలుగురికి స్ఫూర్తిగా నిలిచారు చిరంజీవి.ఇక మధ్యలో రాజకీయాలలోకి వెళ్లి అక్కడ ఇమడక తిరిగి సినిమాలలోకి వచ్చేశారు. ఆ మధ్య ఓ సందర్భంలో రాజకీయాలపై మాట్లాడిన చిరంజీవి ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాలలోకి వెళ్లనక్కర్లేదని అర్ధమైందని తెలిపాడు. నేను పొరపాటున రాజకీయాలలోకి వెళ్లి తప్పు చేశాడు. నాలాంటి వాడు రాజకీయాలకి పనికి రాడు. నేను తిరిగి వచ్చాక కూడా అదే ప్రేమ, ఆదరణ చూపించారు. బ్రతికినంత కాలం సినిమాల్లోనే ఉంటూ సినిమా వాడిగానే ఉంటానని చెప్పారు.
ప్రస్తుతం చిరంజీవి చేతిలో రెండు సినిమాలు ఉండగా ఓ చిత్రం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర పేరుతో షూటింగ్ జరుపుకుంటుంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న విశ్వంభర 2025 సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరో చిత్రం చిరు కూతురి నిర్మాణంలో రూపొందనుంది.అయితే చిరంజీవికి సంబంధించిన పాత వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. సురేఖని పెళ్లి చేసుకోకముందు చిరంజీవికి ఓ లవ్ స్టోరీ ఉందని, అతను ఓ హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉంటే ఆమె మరో హీరోని పెళ్లాడడాని అప్పట్లో టాక్స్ బాగా వచ్చాయి.
ఆ రోజుల్లో చిరంజీవి ఎక్కవగా సినిమాలు చేసింది రాధిక, విజయశాంతి, రాధ, సుమలత వంటి హీరోయిన్స్‌తోనే. ఈ క్రమంలో వారి మధ్య మంచి స్నేహం ఉంది. అయితే సుమలతతో చిరు ప్రేమాయణం నడుపుతున్నాడని కొందరు ప్రచారం చేయడంతో దానిపై సుమలత తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తారు, ఇలాంటివి సృష్టించేవారిపై కేసు కూడా పెడతానంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.చిరంజీవిపై అప్పట్లో ఎలాంటి రూమర్స్ వచ్చేవి కావు. కాని సుమలత విషయంలోనే ఓ రూమర్ బాగా హల్‌చల్ చేసిన అది రూమర్‌గానే మిగిలిపోయింది. కాగా, చిరు ఇండస్ట్రీ లోకి వచ్చిన ఆరు సంవత్సరాల లోపే అల్లు రామలింగయ్య కూతురు సురేఖను వివాహం చేసుకోవడంతో ఆయనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేసే అంత ధైర్యం ఎవరు చేయలేదు