Cinnamon | ప్రస్తుత జీవన విధానంలో మార్పులతో అందరూ ఒబెసిటీతో బాధపడుతున్నారు. అధిక బరువుతో కొత్తగా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టుతున్నాయి. దాంతో చాలా మంది బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. లైఫ్ స్టయిల్‌లో మార్పులతో పాటు ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పలు ఆహార పదార్థాలను తీసుకుంటూ శరీరంలోని కొవ్వును బయటకు పంపేందుకు యత్నిస్తుంటారు. ఇందులో దాల్చిన చెక్కను సైతం తీసుకుంటారు. కొవ్వును తగ్గించేందుకు చెక్కతో కషాయం, టీ చాలా బాగా పని చేస్తాయని చాలామంది అనుకుంటారు. వాస్తవానికి దాల్చిన చెక్క ఆకలిని నియంత్రిస్తుంటుంది. జీవక్రియను పెంపొందించడంలో సహాయపడుతుంది. బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్ ఇన్సులిన్‌కు సరిగ్గా పనిచేసేలా చేస్తుంది.
పలు అధ్యయనాలు దాల్చిన చెక్కను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. దాల్చిన చెక్క నీటిని తాగడంతో తేలిగ్గా బరువు తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. దాల్చిన నీరు తాగడంతో శరీరం మెటబాలిజం పెరుగుతుంది. దాంతో బరువు తగ్గించేందుకు బాగా పని చేస్తుంది. నిత్యం ఉదయం దాల్చిన చెక్కతో నీళ్లు తాగడంతో వెయిట్ లాస్ అవ్వొచ్చు. శరీరంలో చెడు కొవ్వు త్వరగా కరుగుతుంది. ఫలితంగా ఊబకాయం, అధిక బరువును సైతం తగ్గుతుంది. చెక్క నీటిని తాగడంతో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.
చెక్కలో అనేక యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు వాపు తగ్గించడం ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మెదడు ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది. సాధారణ జలుబు, ఫ్లూ, వార్మ్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఫుడ్ పాయిజనింగ్ తదితర ఇన్ఫెక్షన్స్ నిర్వహించడంలోనూ ఎంతో సహాయపడుతుంది. గవద జ్వరం తదితర అలర్జీ సమస్యలను నివారించేందుకు సహాయపడుతుంది. పురుషుల్లో అంగస్తంభన సమస్యతోపాటు, స్పెర్మ్ కౌంట్ బాగా పెరిగేలా చేస్తుంది. మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య తీరిపోతుంది. అయితే, అందరికీ ఈ చిట్కాలు పని చేయస్తాయని కాదని.. ఖచ్చితంగా ప్రయోజనాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, శారీరక శ్రమతో బరువును తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.