Jagan | కడప : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని జగన్ పేర్కొన్నారు. కడప జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జగన్ మాట్లాడారు.
చంద్రబాబును గెలిపించేందుకు ఏ రకంగా కుట్రలు జరుగుతున్నాయో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలి. చంద్రబాబును గెలిపించడం, మన ఓట్లను చీల్చడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా రాష్ట్రంలో రంగ ప్రవేశం చేసిందంటే చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయో గమనించాలి. చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి. ఇదే రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ సీఎం. ఒక వైపున పట్టపగలు బీజేపీతో, రాత్రి పూట కాంగ్రెస్‌తో చంద్రబాబు కాపురం చేస్తారు. కాబట్టి రాజకీయాలు ఎలా దిగజారిపోయాయో ఆలోచించమని కోరుతున్నాను. చంద్రబాబు కోసమే కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని జగన్ పేర్కొన్నారు.
చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి.. చంద్రబాబును గెలిపించడం కోసం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ రంగ ప్రవేశం చేసింది – జగన్ మోహన్ రెడ్డి pic.twitter.com/mh9aUkciqu
— Telugu Scribe (@TeluguScribe) May 10, 2024