CM Jagan | ముస్లిం రిజర్వేషన్లపై టీడీపీ స్టాండ్ ఏంటో చెప్పాలని ఆ పార్టీ అధినే చంద్రబాబును ఏపీ సీఎం జగన్ (CM Jagan) నిలదీశారు. ముస్లిం రిజర్వేషన్ల రద్దు విషయంలో బీజేపీకి వంత పాడుతారా లేదా ఆ పార్టీని నిలదీస్తారా అంటూ ప్రశ్నించారు. ముస్లింలను మోసం చేస్తారా? ఎన్డీయే నుంచి బయటకు వస్తారా? సమాధానం చెప్పాలంటూ ప్రశ్నలు సంధించారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్నూలు, కల్యాణదుర్గం, రాజంపేటలో సీఎం జగన్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ మైనార్టీలకు రిజర్వేషన్లు ఉండాలని తాను చెప్పడమే కాదు.. పొలిటికల్ రిజర్వేషన్లు కల్పించి చూపానని కర్నూలు సభలో ప్రకటించారు. నలుగురు ఎమ్మెల్సీలు, ఏడుగురు మైనార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చామని తెలిపారు.
ప్రధాని మోదీ, అమిత్‌షాలతో చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలు ఏర్పాటు చేయించారు. పదేండ్ల క్రితం రావాల్సిన ప్రత్యేక హోదాను ఇప్పటికైనా ప్రకటిస్తామోనని ప్రజలు ఆశించారు. కాని నిరాశే మిగిలిందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ఒక్క మాట కూడా మోదీ, అమిత్‌షా నోటి వెంట చెప్పించలేకపోయారు. మొన్నటి వరకు చంద్రబాబును విమర్శించిన మోదీ.. ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు.
చంద్రబాబు, దత్తపుత్రుడికి ఏం కావాలో అది మాత్రమే మాట్లాడారంటూ విమర్శించారు. పేదలకు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు అందించడం పెత్తందార్లకు నచ్చడం లేదని జగన్ విమర్శించారు. మరి మీ పిల్లలు, మీ మనవళ్లు ఎక్కడ చదువుతున్నారని ప్రశ్నించారు. ఈ పెత్తందార్ల కూటమిని వ్యతిరేకించాలంటూ పిలుపునిచ్చారు.
చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని చెప్పారు. పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాల ముగింపేనని తెలిపారు. గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా అని ప్రశ్నించారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చామన్నారు. సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. మూడో తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్టు టీచర్లు. 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన. ఇంటర్నేషనల్ యూనివర్సిటీలతో సర్టిఫైడ్ కోర్సులు. పిల్లల చదువు కోసం తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి. విద్యారంగంలో జరిగిన విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అన్నారు.
మైనార్టీలకు 4 శాతం పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఇస్తూ..
7 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన పార్టీ వైయస్ఆర్సీపీనే.#YSRCPWinning#YSJaganAgain#VoteForFan#TDPJSPBJPCollapse pic.twitter.com/hGqGts6bk6
— YSR Congress Party (@YSRCParty) May 9, 2024