జాతీయ రహదారుల విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి జాతీయ రహదారులకు భూసేకరణ విషయంలో మానవీయతతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లకు సూచించారు. నిబంధనల ప్రకారం ఎంత ఎకువ పరిహారం వస్తుం దో అంత మొత్తం రైతులకు దకేలా చూడాలని చెప్పారు.
జాతీయ రహదారులకు భూసేకరణ విషయంలో మానవీయతతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లకు సూచించారు. నిబంధనల ప్రకారం ఎంత ఎకువ పరిహారం వస్తుం దో అంత మొత్తం రైతులకు దకేలా చూడాలని చెప్పారు. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా భూసేకరణ ఎందుకు ఆలస్యమవుతున్నదని అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తకువగా ఉండటం, మారెట్ ధరలు ఎకువగా ఉండటంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని కలెక్టర్లు తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ, తరతరాలుగా వస్తున్న భూములను రైతులు శాశ్వతంగా కోల్పోతున్నారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్లే స్వయంగా రైతులను పిలిచి మాట్లాడి వారిని ఒప్పించాలని సూచించారు. ప్రాంతీయ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగం, ఉత్తర భాగం వేర్వేరుగా చూడొద్దని, ఆ రెండింటికీ కలిపి ఒకే నంబర్ కేటాయించేందుకు కేంద్రమంత్రి నితిన్ గడరీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారని చెప్పారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్‌హెచ్‌ఏఐ మధ్య త్రైపాక్షిక ఒప్పందం (ట్రైపార్టియేట్ అగ్రిమెంట్) ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
కోర్టు స్టేపై రేపు కౌంటర్ దాఖలు
రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ విషయంలో రైతుల పిటిషన్‌పై హైకోర్టు స్టే ఇచ్చిందని యాదాద్రి భువనగిరి కలెక్టర్ హన్మంత్ కే జెండగే తెలిపారు. స్టే తొలగింపునకు వచ్చే శుక్రవారం నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నాగ్‌పూర్-విజయవాడ కారిడార్‌కు సంబంధించి ఖమ్మం సమీపంలో భూములకు పరిహారం విషయంలో రైతులను ఒప్పిస్తున్నామని ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తల్లాడ-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ రహదారి పనులు సాగుతున్నందున, ప్రస్తుతం ఖమ్మం నుంచి అశ్వారావుపేట వరకు ఉన్న జాతీయ రహదారిని రాష్ట్ర రహదారిగా మార్చుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సూచిస్తున్నారని చెప్పారు. దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని, జాతీయ రహదారిగానే దానిని కొనసాగించాలని మంత్రి సూచించారు.
అటవీశాఖకు ప్రత్యామ్నాయ భూములు
ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల, విజయవాడ-నాగ్‌పూర్ రహదారుల్లో అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములు కేటాయించాలని నిజామాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లకు సీఎం సూచించారు. హైదరాబాద్ -మన్నెగూడ రహదారి పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని చెప్పారు.
2 నెలల్లో హైదరాబాద్- విజయవాడ రోడ్డు విస్తరణ
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ఆరు వరుసల విస్తరణ పనులకు భూసేకరణ పూర్తయినందున వెంటనే పనులు చేపట్టాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు మెంబర్ అనిల్ చౌదరిని కోరారు. రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని ఆయన బదులిచ్చారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ఓఎస్డీలు శేషాద్రి, మాణిక్‌రాజ్, చంద్రశేఖర్‌రెడ్డి, షానవాజ్ ఖాసిం, మౌలిక వసతుల సలహాదారు శ్రీనివాసరాజు, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి రజాక్, పీసీసీఎఫ్ డోబ్రియల్, ఆర్‌అండ్‌బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, జాయింట్ సెక్రటరీ హరీశ్, వివిధ జిల్లాల కలెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.