రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చెక్కర్లు కొడుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఆయన 20సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు. తాజాగా 20వ తేదీ రాత్రి మరోసారి ఢిల్లీకి వెళ్తున్నట్టు సచివాలయ వర్గాలు వెల్లడించాయి. ఈసారి సోనియా రాహుల్ ప్రియాంక గాంధీ తో పాటు కాంగ్రెస్ పెద్దలను మరోసారి కలిసి తన పరిపాలన మార్కులను నివేదించబోతున్నారు. ఇప్పటికే ప్రతి నిర్ణయం ప్రతి అంశం ఢిల్లీలో చర్చించి హైదరాబాద్ వస్తున్న రేవంత్ రెడ్డి తాజాగా రుణమాఫీ నిరుద్యోగ అంశాలు గ్రూప్ టు వాయిదాల అప్డేట్ను ఢిల్లీ పెద్దలకు వివరించబోతున్నట్టు చెబుతున్నారు. వరంగల్ లో రుణమాఫీ కృతజ్ఞత సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రాహుల్ గాంధీని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించేందుకు మళ్ళీ డిల్లీ వెళుతున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సీఎంగా బాధ్యతలు తీసుకున్న ఈ ఏడున్నర నెలల కాలంలో 20 సార్లు ఢిల్లీకి వెళ్లారు. చీటికిమాటికి హస్తిన పర్యటన పట్ల ఇప్పటికే తెలంగాణలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. పాలన గాడికి పర్యటనలు వేడికి అన్నట్టు తయారైంది ముఖ్యమంత్రి పరిస్థితి అని కాంగ్రెస్ పార్టీలోనే సెటర్లు విసురుకుంటున్నారు
జాబ్ క్యాలెండర్ రెడీ
కాంగ్రెస్ మాట ఇచ్చిన ప్రకారం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ను రూపొందిస్తున్నట్టు ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోబోతున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నీళ్లు నిధులు నియామకాల పై పురుడు పోసుకున్న తెలంగాణలో అందరూ ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.
ప్రజా భవన్ లో “రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం” ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగిందని చెప్పారు.త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందని,
నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రాధాన్యతని స్పష్టం చేశారు.
అందుకే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని పేర్కొన్నారు. గత పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని మార్పులు చేశామని, గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వాహించామని,… డీఎస్సీ పరీక్షలు కొనసగుతున్నాయని, నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్2 పరీక్ష వాయిదా వేశామని వివరించారు. పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇక నుంచి ప్రతీ ఏటా మార్చి లోగా అన్ని శాఖలలో ఖాళీల వివరాలు తెప్పించుకుని
జూన్ 2లోగా నోటిఫికేషన్ వేసి డిసెంబర్ 9లోగా నియామక హో ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
మూసీ చూసి మురువాలే… వచ్చే పదేళ్లలో విశ్వనగరం
ఇన్నాళ్లు మూసిని చూసి ముక్కు మూసుకున్నారని, కానీ వచ్చే ఐదు ఏళ్ల తర్వాత మూసిని చూస్తే అందరూ మురిసిపోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.లండన్ థెమ్స్ నడిలా మూసీ సుందరీకరిస్తామని పేర్కొంటూ మూసీ రివర్ డెవలప్మెంట్ కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనిచెప్పారు.
త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేసి లక్షా 50వేల కోట్లతో పనులను ప్రారంభించుకోబోతున్నామన్నారు.హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేసుకోవడమే మన ముందున్న లక్ష్యంమనిచెప్పారు. రాబోయే ఐదేళ్లలో ప్రపంచ పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసామని, మూసీ అభివృద్ధి చూడగానే ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతమని చెప్పారు. శనివారం గోపన్‌పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లిని వేగంగా అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. హైదరాబాద్ నగరంలో సమస్యల పరిష్కారానికి, విపత్తుల నిర్వహణకు హైడ్రా అనే నూతన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సమాచార రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి తో పాటు పలువు నేతలు పాల్గొన్నారు
25 కేబినేట్ భేటీ 26 బడ్జెట్
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతనఈనెల 25న జరగనుంది. 26వ తేదీన తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్ బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్న నేపథ్యంలో క్యాబినెట్ బీటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. క్యాబినెట్లో బడ్జెట్ ఆమోదంతో పాటు పది బిల్లులపై అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. బడ్జెట్, అసెంబ్లీ సమావేశాలు దాదాపు పది రోజులు నిర్వహించే అవకాశం ఉంది. ముఖ్యమైన పది బిళ్ళపై అసెంబ్లీలో చర్చ.