ఆ 8 సీట్లు ఎందుకు ఓడినయి.
కాంగ్రెస్ పార్టీలో కొరియన్ కమిటీ కాక పుట్టిస్తున్నది. ఇవల పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిపాలైన నేతలు సీట్లపై గురువారం గాంధీభవన్లో సుదీర్ఘ సమీక్ష సమావేశం జరిగింది. ఇటీవల తెలంగాణలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్ల గాను బిజెపి ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది మాత్రమే గెలుచుకుంది. రాష్ట్రంలో అధికరణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు కోల్పోవడం పట్ల పార్టీ హైకామాండ్ సీరియస్ గా ఉంది. ఈ నేపథ్యంలో ఏఐసిసి ప్రత్యేక కమిటీ గాంధీభవన్కు వచ్చి విచారణ చేపట్టింది. ముఖ్యమంత్రిగా ప్రతినిధి నిర్వహిస్తున్న సొంత జిల్లా మహబూబ్నగర్, మల్కాజ్గిరి తోపాటు సీఎం రేవంత్ పట్టుబట్టి ఇప్పించుకున్న చేవెళ్ల, సికింద్రాబాద్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, తదితర స్థానాల్లో పార్టీ ఓటమిపాలైంది. ఈ స్థానాలకు ఎంపీ అభ్యర్థులను సీఎం రేవంత్ పట్టుబడి టికెట్ ఇప్పించుకున్నారు అయితే ఎందుకు గెలిపించుకోలేదన్న అంశంపై ఏఐసిసికి ఇప్పటికే ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో బలం లేదని సొంత జిల్లాలో పరపతి కూడా లేదని చెప్పడానికి ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో నిదర్శనమని అసమతి నేతలు ముఖ్యంగా పార్టీ సీనియర్లు నివేదికల మీద నివేదికలు అందించారు. ఈ నేపథ్యంలో కురియన్ తో పాటు మరో నలుగురు ఏఐసీసీ పెద్దలు ఇవాళ ఐదు పార్లమెంట్ స్థానాలపై రివ్యూ నిర్వహించారు. మూడు స్థానాలపై రేపు సమీక్ష నిర్వహించబోతున్నారు.
దాదాపు 8గంటల పాటు వివరాలు సేకరించిన కమిటీ ఎంపీలతో వన్ టు వన్ సమావేశం కొనసాగించింది.
రేపు ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థుల తో సమావేశం ఉంటుందని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి