ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారాం తండాలో నునావత్ మోతీలాల్ గారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరామర్శించారు. రెండు రోజుల కిందట కారులో హైదరాబాద్ వెళ్తూ ప్రమాదవశాత్తు ఆకేరు వాగు వరదలో కొట్టుకుపోయి నునావత్ మోతీలాల్, ఆయన కుమార్తె యువ వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని గార్లు మృతి చెందారు. వారి చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి ముఖ్యమంత్రిగారు నివాళులర్పించారు.