హైదరాబాద్ : నిమ్స్ వైద్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఛాతిలో బాణం దిగిన ఆదివాసీ యువకుడిని ప్రాణాలతో కాపాడినందుకు అభినందనలు తెలుపుతూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ప్రాణపాయం లేకుండా చాకచక్యంగా బాణాన్ని తొలగించారని సీఎం కితాబిచ్చారు. ప్రజల్లో నిమ్స్‌పై ఉన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేశారు అని సీఎం ప్రశంసించారు. భవిష్యత్‌లో నిమ్స్ మరింత విస్తృతంగా వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు రేవంత్ సూచించారు.