Friday, April 4, 2025
HomeTelanganaCM Reavnt Reddy- Harish Rao: రుణ మాఫీపై రణం

CM Reavnt Reddy- Harish Rao: రుణ మాఫీపై రణం

రుణ మాఫీపై రణం
పదేండ్లలో ఏం చేశారన్న సీఎం రేవంత్
రైతు కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టాం – పల్లా
అబద్దాలు చెప్పి బతికేస్తున్నరు – కెటిఆర్
హరీష్ రాజీనామా చేయాలంటూ గన్ పార్క్ వద్ద నిరసన

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న రైతు రుణ మాఫీ రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. అధికార విపక్షాల నడుమ రుణ మాఫీ పై ఢీ అంటే ఢీ అనే తరహాలో ప్రకటనలు చేస్తున్నారు. కెసిఆర్ పదేండ్లలో రూ.21 వేల కోట్లు ఖర్చు పెడితే ఈ ఏడునెలల్లోనే రూ.31 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో బిఆర్ఎస్ నుండి అటు కెటిఆర్, హరీష్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్ వేధికగా కౌంటర్లిచ్చారు. ఇంకోపక్క గాంధీ భవన్ లోనూ ఎంపీలు,ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలు బిఆర్ఎస్ నేతల ఆరోపణలను తిప్పికొడుతున్నారు. పదేండ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేశామని బిఆర్ఎస్ నేతలు లెక్కలతో సహా వివరిస్తున్నారు. ఇంకో పక్క మాజీ మంత్రి హరీష్ రాజీనామా అంశంపై కూడా రగడ కొనసాగుతున్నది. రుణ మాఫీ అంశాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకెల్లేందుకు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్లు జిల్లాల పర్యటనలు చేస్తూ కాంగ్రెస్ ఏడు నెలల పాలనపై జనాలకు వివరిస్తున్నారు.

రూ.లక్ష కోట్ల లెక్కలివిగో…- …..ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ..

ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ,ఎమ్మెల్యేలు కె .పి .వివేకానంద ,కోవా లక్ష్మి ,బీ ఆర్ ఎస్ నేతలు రాకేష్ రెడ్డి ,రాం బాబు యాదవ్ ,తుంగ బాలు
.రాష్ట్రం లో గత నాలుగైదు రోజులుగా సీఎం ,మంత్రులను రైతులను మాయ చేస్తున్నారని, .రైతులకు అంతా మేమే చేశాo కేసీఆర్ హయం లో ఏం జరగలేదన్నట్టుగా మాట్లాడుతున్నారని .కాంగ్రెస్ వాళ్ళ అబద్దాలు చూసి గోబెల్స్ బతికి ఉంటె ఆత్మహత్య చేసుకునే వారని జనగామ …..ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. .ఈ ప్రభుత్వం రైతుల రుణ మాఫీ కోసం విడుదల చేసింది 6 వేల కోట్ల రూపాయలు మాత్రమేనని చెప్పారు. ..ఇది రుణాలున్న రైతుల్లో 30 శాతం ..డబ్బుల పరంగా చూస్తే 20 శాతం మాత్రమే నన్నారు…రైతులకు కాంగ్రెస్ చేసింది గోరంత ..కొండంతలుగా గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవ చేశారు. .కేసీఆర్ హయం లో మొదటి విడతలో 35 లక్షల మంది రైతులకు 17 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ కింద చెల్లించామని, ..రెండో విడత లో 19 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీకి సిద్ధంగా ఉంచుకుని 12 వేల కోట్లు చెల్లించామని, ..ఇంకా ఏడు వేల కోట్లు కాంగ్రెస్ ఈసీ కి చేసిన పిర్యాదు తో చెల్లించకుండా మిగిలి పోయాయని వివరించారు. ..ఆ ఏడు వేల కోట్లు మంత్రుల కాంట్రాక్టు సంస్థలకు వెళ్లాయని ఆరోపించారు. .లక్ష లోపు రుణాల మొత్తం కేసీఆర్ హయం లో 19 వేల కోట్లు ఉంటె ఇపుడు 6 వేల కోట్ల కు ఎలా తగ్గింది ..ఎవర్ని మోసం చేస్తున్నారని ప్రశ్నించారు. .ఆంక్షల పేరిట రైతుల రుణ మాఫీ ని కొందరికే పరిమితం చేసిందన్నారు. .కేసీఆర్ హాయం లో రైతుల అకౌంట్ల లోకి పదేళ్ల లో లక్ష కోట్ల రూపాయలు చేరిందన్నారు. .70 వేల కోట్లు రైతు బంధు కింద కేసీఆర్ రైతులకిచ్చారని, 30 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ కింద ఇచ్చారని, .7 వేల కోట్లు లక్షా 20 వేల మంది రైతుల కుటుంబాలకు బీమా కింద చెల్లించారని, .3 కోట్ల టన్నుల ధాన్యాన్ని కేసీఆర్ హయం లో రైతులు పండించారని చెప్పారు.
కాంగ్రెస్ నేతల కళ్లల్లోనే ఆనందం
..కాంగ్రెస్ నేతల మొహం లోనే ఆనందం కనిపిస్తుంది తప్ప రైతుల మొహం లో లేదని, .సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నార ప్లలా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ..రైతు భరోసా కింద 12 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా రుణ మాఫీ కింద 6 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, .కాంగ్రెస్ వచ్చింది రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని చెప్పారు. …రుణ మాఫిని కేసీఆర్ ఏ ఆంక్షలు లేకుండా అమలు చేసినట్టు రేవంత్ అమలు చేయాలిన్నారు…హరీష్ రావు రాజీనామా సవాలు ను సీఎం కాంగ్రెస్ నేతలు వక్రీకరిస్తున్నారన్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు