Wednesday, April 2, 2025
HomeTelanganaGanesh Visarjan | గ‌ణేష్ నిమ‌జ్జ‌న ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించిన సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Visarjan | గ‌ణేష్ నిమ‌జ్జ‌న ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించిన సీఎం రేవంత్ రెడ్డి

గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్విఘ్నంగా సాగేలా చూడాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జన ప్రదేశాలను వారు పరిశీలించారు. నిమజ్జన ప్రక్రియ ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.

నిమజ్జన ప్రదేశాల్లో అమర్చిన క్రేన్స్ వద్ద పరిస్థితులను ముఖ్యమంత్రి గారు పరిశీలించారు. క్రేన్ డ్రైవర్స్, ఇతర సిబ్బందితో మాట్లాడారు. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకునేలా సిబ్బందికి మూడు షిఫ్టుల్లో విధులు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. నిమజ్జనం కోసం వచ్చిన భక్తులను పలకరించారు. అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

ముఖ్యమంత్రి గారి వెంట పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు జీఎహెచ్‌ఎంసీ మేయర్‌, కమిషనర్‌, హైదరాబాద్‌ సిటీ పోలీస్ కమిషనర్‌ ఇతర అధికారులు ఉన్నారు.

 

RELATED ARTICLES

తాజా వార్తలు