Revanth Reddy | భారతీయ జనతా పార్టీ నాయకులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపోళ్లు బిచ్చపోల్లు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో రేవంత్ రెడ్డి పాల్గొని జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి. వాళ్లే అసలైన హిందువులు తప్ప.. బజార్లో దేవుడి ఫొటో పెట్టి ఓట్లు అడుక్కునేటోడు బిచ్చపోడు అయితడు. బస్టాండ్లలో అప్పుడప్పుడు చూస్తుంటాం. ఒక పెద్ద తాంబాలం పెట్టుకుని, దాంట్లో అయ్యప్ప ఫొటో పెట్టుకుని, అయ్యా నాకు కాళ్లు లేవు, చేతులు లేవు, కళ్లు కూడా లేవు. దేవుడిని చూసి బిచ్చమేయ్.. బతుకుతా అని అడుగుతడు. అట్లనే బీజేపోళ్లు ఓట్లు అడుగుతున్నరు. ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా..? హిందూ ధర్మాన్ని వంచించడం సరికాదు. ఇవాళ మన ధర్మాన్ని కాపాడుకోవాలి. రైతులను ఆదుకోవాలి.. పసుపు బోర్డు తెచ్చుకోవాలి.. చక్కెర పరిశ్రమను మళ్లీ పునరుద్ధరించాలంటే జీవన్ రెడ్డి గెలిపించుకోవాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.