Sunday, December 29, 2024
HomeTelanganaCM Revanth Reddy | టార్గెట్ కేవీపీ..? సీనియర్లకే ఎసరు..

CM Revanth Reddy | టార్గెట్ కేవీపీ..? సీనియర్లకే ఎసరు..

Janapadham_EPaper_TS_04-10-2024

టార్గెట్ కేవీపీ..?

సీనియర్లకే ఎసరు..

నిన్న పల్లం రాజు.. నేడు కేవీపీ..

మొత్తం కక్కిన రేవంత్..

అంతుచూస్తామని ప్రకటించిన సీఎం..

రింగ్ మాస్టర్ గా ఆడిస్తున్నాడని ధ్వజం..

ఎవ్వరినీ వదిలేది లేదని ఘాటు వ్యాఖ్యలు..

అద్గది అసలు ముచ్చట. పెద్దరికం లేదు., తొక్కాతోటకూర అస్సలే లేదు. పదవి లేకముందు రెచ్చిపోయినట్టు సీఎం అయ్యాక చేస్తే కుదరదనే చిన్న గ్యాప్ అంతే. ఇక సీటు కిందకే నీళ్లు తెచ్చేందుకు అంతా ఒక్కటవుతున్నారని తెలిసిన తర్వాత కూడా ఎందుకాగాలి., ఎవరికోసం భరించాలి. తెలిసింది అనుడే., చెడామడా దులుపుడే. ఇప్పటికే దెబ్బమీద దెబ్బతో గాయిగత్తర పడ్తాంటే, ఇంకా కవ్వింపులు భరించేది లేదనే సంకేతాలిచ్చారు.

జనపదం, బ్యూరో

మొత్తం కక్కిండు., రేవంత్ లోని లోపలి మనిషి బయటకొచ్చిండు. కేవీపీ సహా సీనియర్లందరినీ ఏకిపారేసిండు. కుండబద్ధలు కొట్టినట్టుగా ఉన్నదున్నట్టుగా, మనస్సులో అనిపించిందంతా చెప్పేసిండు. హైడ్రాతో రాష్ట్రంలో జరుగుతున్న దుమారం., హస్తినాలో తలంటిపోసిన అవమానంతో సీఎం తట్టుకోలేకపోతున్న ఆనవాళ్లు ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించాయి. సొంతపార్టీలోని సీనియర్లే కుంపటి పెడుతున్నట్టు అనిపించిన అనుమానాలతో రెచ్చిపోయారు. ఇన్నాళ్లు కలుపుకుని పోతానని, పార్టీ కోసం కలిసి పనిచేస్తామని పలికిన ఆయన ఇవ్వాళ అన్నీ పక్కన పెట్టి తేల్చుకుందాం.. అనే స్థాయిలో విరుచుకుపడ్డారు.

సీనియర్లకే ఎసరు..
కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లకు సీఎం రేవంత్ ఎసరుపెట్టినట్టుగా స్పష్టమవుతున్నది. ఆ మాటకొస్తే తనకే సీనియర్లంతా కలిసి సీటికిందకు నీరు తెస్తున్నట్టుగా అనుమానపడుతున్న ముఖ్యమంత్రి ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న ఆక్రోషంతో ఊగిపోయారు. ఢిల్లీలో జరిగిన అవమానం, పెద్దలు హైడ్రా విషయంలో ఇచ్చిన వార్నింగ్ తో సీఎం డీలాపడ్డాడు. తనపై పార్టీలోని రాష్ట్ర సీనియర్లంతా చేసిన ఫిర్యాదులు, తన పనులకు అడ్డుపడుతున్న తీరునంతా ఇన్నాళ్లు భరించిన ఆయన ఇక తట్టుకోలేక బరస్ట్ అయ్యారు. హైడ్రా తో డ్రామాలు ఆడొద్దని, పేదలను అడ్డుపెట్టుకుని కూల్చివేతలను అడ్డుకోవాలని చూస్తున్న వారి తీరును ఊరుకునేది లేదని కరాకండిగా ప్రకటించారు. నిన్నటి నిన్న పల్లంరాజు వంతు పూర్తి అయిందని, ఇక తర్వాత కేవీపీదేనని తేల్చేశారు.

నిన్న పల్లం రాజు.. నేడు కేవీపీ..
కేవీపీ అంటే సీఎం రేవంత్ కు మొదటి నుంచి గిట్టని తనమే. సీఎం కావడానికి ముందే ఎప్పుడు సందర్భం వచ్చినా నిప్పులు తొక్కేవాడు. మాజీ సీఎం కేటీఆర్ తో కేవీపీకి ప్రత్యేక అనుబంధం ఉందని, నమ్మాల్సిన వ్యక్తి ఎంతమాత్రం కాదని ప్రతి చోట దుయ్యబట్టేవాడు. కానీ, ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాస్త నెమ్మదించాడు. పదవికి ఇవ్వాల్సిన గౌరవమనో, లేదంటే ఇప్పుడప్పుడే షురూ చేస్తే ఆగమవుతామనే జాగ్రత్తోగానీ విమర్శల వాడి తగ్గింది. తాజాగా ఢిల్లీ నుంచి పిలుపు రావడం, హైడ్రాపై అప్పటికే రాష్ట్రంలోని పలువురు మంత్రులు, సీనియర్ మోస్ట్ లీడర్లు హస్తినా పెద్దల దగ్గర పూసగుచ్చినట్టుగా చెప్పడంతో అధిష్టానం రేవంత్ ను ఓ దులుపుడు దులిపింది. దీంతో ఆయన రాష్ట్రానికి వచ్చీ రాగానే మొట్టమొదటి సమావేశంలోనే రెచ్చిపోయారు. వాడి అయిన మాటలతో అంతు చూస్తాననే రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు. ఉన్నది ఉన్నట్టు.. ఉండదు కనికట్టు. ఇన్నాళ్లు భయానికో., భక్తికో వెనకాముందు ఆలోచించి ఆగినా ఇవ్వాళ కుండబద్ధలు కొట్టినట్టుగా చెప్పేశారు. అక్కడేం జరిగిందో., ఇక్కడే ఏమైందోగానీ ముఖ్యమంత్రి లోపలి మనిషిని బయటకు తీశారు. సీనియర్లను టార్గెట్ చేసుకుని అనాలనుకున్నవన్నీ అనేశాడు. మరీ ముఖ్యంగా తనను ఎదగనివ్వకుండా చేస్తున్న కేవీపీని ఉద్దేశించి గట్టిగానే మాట్లాడారు.

RELATED ARTICLES

తాజా వార్తలు