CMRF: సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై ఇలా చేయాలి..!!
హైదరాబాద్: సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు పారదర్శకంగా లబ్ధిదారులకు అందేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే మార్గదర్శకాలు రూపొందించి, అమలు చేస్తామని ప్రకటించింది. సీఎంఆర్ఎఫ్ కోసం ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నిధులు పక్కదారి పట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. దాంతో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారిక వెబ్ సైట్ రూపొందించింది. ప్రజలు గమనించి అత్యవసరాలకు వాడుకోవాలని కోరారు.