Colors Swathi| కలర్స్ అనే టీవీ షోతో కలర్స్ స్వాతిగా మారిన ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ముందుగా యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన స్వాతి ఆ తర్వాత సింగర్‌గా, ఆర్టిస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇలా మల్టీ టాలెంట్‌తో దూసుకుపోయింది.డేంజర్ అనే సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన స్వాతి ఆ తర్వాత అష్టాచమ్మా సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కార్తికేయ సినిమాతో ఈ అమ్మడి రేంజ్ మరింత పెరిగింది. కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలోనే స్వాతి వివాహం చేసుకుంది. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు కాస్త దూరం అయింది స్వాతి.
ఇటీవలే మంత్ ఆఫ్ మధు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తన నటనతో మరోసారి అదరగొట్టింది. ఇక ఇప్పుడు కూడా పలు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్‌లో ముందుకు దూసుకుపోతుంది. అయితే ఆ మధ్య స్వాతి విడాకులకి సంబంధించి నెట్టింట అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆమె తన భర్త నుండి విడిపోయిందని, ఈ ఇద్దరు దూరంగా ఉంటున్నారని ప్రచారం జరిగింది. కాని దీనిపై ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక స్వాతి సినిమాల ద్వారానే కూడా సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తుంది. రీసెంట్‌గా తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పరిచయం చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే ఈ వీడియోకు ఓ నెటిజన్ స్టన్నింగ్ కామెంట్ చేశారు.
ఛీ నీ బతుకు అని వీడియోకి నెటిజన్ రిప్లై ఇవ్వగా, దానిపై స్వాతి ఆసక్తికర కామెంట్ చేసింది. ‘నాకు కూడా కొన్ని సార్లు అలానే అనిపిస్తుంది.. జీరో పోస్ట్ ఛాంపియన్స్’ అంటూ తనదైన శైలిలో స్పందించింది. స్వాతి ఇచ్చిన కౌంటర్‌కి మనోడు సైలెంట్ అయిపోయాడు. అయితే ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ అవుతుంది. స్వాతి నెటిజన్స్‌కి ఇలా కౌంటర్స్ ఇవ్వడం కొత్తేమి కాదు. మంత్ ఆఫ్ మధు సినిమా రిలీజ్ తర్వాత నెగెటివ్ రివ్యూలు చూసి స్వాతి హర్ట్ అయినట్టు ఉంది. కొందరికి భలే కౌంటర్స్ ఇచ్చింది. ఇక పాజిటివ్ కామెంట్లను చూసి ఫుల్ ఖుషీ అవుతూ ఇన్ స్టా స్టోరీలో వాటిని షేర్ చేసింది.