Friday, April 4, 2025
HomeTelanganaHYDRAA | హైడ్రాతో పొడ్సిందేంటి..?

HYDRAA | హైడ్రాతో పొడ్సిందేంటి..?

JanaPadham_EPaper_TS_02-10-2024

హైడ్రాతో
పొడ్సిందేంటి…?

ఇప్పుడు నిమ్మలమైందా..?
నాశనం చేసేదాక నిద్రపట్టలేదా..?
ఎందుకు గోక్కున్నట్టు..
కలుపుకుని పోకుంటే దూల తీరుద్దని తెల్వదా….
సీనియర్లంటే లెక్కలేదా..?
హైడ్రా.. ఆలోచన వెనకేముంది..
ప్రజల్లో వ్యతిరేకత కనిపించడం లేదా…?
పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం క్రియేట్ చేశారు..
ఇతర రాష్ట్రాల్లో ప్రభావం పడే అవకాశం ఉంది..
సంప్రదించకుండా ఏమీ చేయొద్దు..
సీఎం రేవంత్ కు తలంటిని అధిష్టానం..
కూల్చివేతల విషయమై ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ..

కూల్చడంలో ఉన్న ఆనందం కుక్క తిట్లు పడేలా చేసింది. నేలమట్టం చేయడంలోని పైశాచికం మెడలు వంచి నిలబడేలా మార్చింది. ఏదో పొడుస్తానని మొదలు పెట్టిన హైడ్రా మొదటికే మోసం చేసింది. కాచుకుని కూర్చున్న కళ్లకు ఎన్నో అవకాశాలను, మూసుకపోయిన పెదాలకు మరెన్నో పదాలను అందించేలా చేసిన అతి విన్యాసం ఇప్పుడు అధిష్టానంతో దొబ్బులు పడేలా చేసింది. రాష్ట్రమంతా కలకలం రేపుతున్న కూల్చివేతల ఎపిసోడ్ ఢిల్లీకి వెళ్లడంతో రేవంత్ కు తలంటిపోశారు. పెద్దల పిలుపుతో హుటాహుటీనా హస్తినాకు వెళ్లిన సీఎం ఏం చెప్పలేక, చెప్పింది వారికి నచ్చక, ఇప్పటికే సీనియర్లు చెప్పిన దాంతో అటు కక్కలేక, ఇటు మింగలేక అన్నట్టుగా దోషిగా నిలబడాల్సిన దుస్థితి దాపురించింది. ఇన్నాళ్లు మాంచి ఊపుమీదున్న రేవంత్ కు రాహుల్ చీవాట్లు బహుమానంగా దక్కాయి. దూకుడు తగ్గించుకుని పార్టీని నాశనం చేసే పనులకు చరమగీతం పాడాలనే ఉపదేశాలు అనుభవంలోకి వచ్చాయి.
====================

జనపదం, బ్యూరో

గోక్కోవడం ఎందుకు.., బాధపడడం దేనికి..? అసలు పార్టీని ఏం చేద్దామని నీ ఉద్దేశం. జనాల్ని ఉద్ధరించడానికి నువ్వే ఉన్నవా..? సీనియర్లంటే పట్టింపులేదు., సలహాలు చెబితే వినే ఓపిక ఉండదు..? ఏదో పొడ్తవని అనుకుంటే, మొత్తం పెంటపెంట చేశావ్. పార్టీ ఇప్పుడిప్పుడే పట్టుసాధిస్తున్నది సంబురపడుతాంటే, తెలివి తక్కువ పనులతో నాశనం చేశావ్. డీలాపడిన ప్రతిపక్షాలకు హైడ్రాతో బూస్ట్ ఇచ్చి, రాష్ట్రంలో మళ్లీ ఇబ్బందులు పెంచావ్. మొన్నటి దాకా మంచిగానే ఉన్నావ్ కదా.. ఇప్పుడేమైంది.? పూర్తిగా నిన్ను నమ్మడం మేం చేసిన తప్పా, లేదంటే కావాలనే ఇదంతా చేస్తున్నావని అనుమాన పడాల్నా..? ఇప్పటికైనా ఒళ్లు జాగ్రత్తగా, పనుల్లో అప్రమత్తంగా ఉంటేనే మంచిది. లేదంటే ఊహించనవి ఎదుర్కోవాల్సి వస్తుంది. రేవంత్ కు ఢిల్లీలో జరిగిన అనుభవ సారం ఇది.
హైకమాండ్ ఫైర్..
హైడ్రాపై రాష్ట్రమంతా కుతకుత ఉడుకుతున్న సమయంలో ఢిల్లీ నుంచి రేవంత్ కు అర్జంట్ పిలుపొచ్చిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం రాత్రికి రాత్రే ఆయన హస్తినాకు వెళ్లిపోయారు. రాష్ట్రంలో సీఎం చేపట్టిన సంస్కరణలు, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత అన్ని విషయాలు పెద్దలంతా ఆరా తీశారు. ఇప్పటికే రాష్ట్రంలోని సీనియర్ మంత్రులు, పార్టీ పెద్దలు ఇక్కడ జరుగుతున్న ప్రతిదీ పిన్ టు పిన్ చేరవేస్తుండడంతో అన్నింటినీ బేరీజు వేసుకున్న పార్టీ పెద్దలు ఒక్కో విషయంపై స్పష్టంగా వివరాలు లాగేందుకు సమయం వెచ్చించారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై రాహుల్ గాంధీ, పార్టీ హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

నేను వ్యతిరేకిస్తా.. నువ్వేం చేస్తూ పో..
ఇబ్బడిముబ్బడి కూల్చివేతలపై నేనేమో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంటే నువ్వేమో అదే పనిచేస్తూ పార్టీ పరువు తీసెయ్ అని రాహుల్ గరంగానే నిలదీశారు. హైదరాబాద్ అంటే ఇప్పుడు దేశమంతా హైడ్రా అనే గుర్తుకొచ్చేలా చేశావని, ఎందుకు ఇలాంటి తెలివిమాలిన పనికి శ్రీకారం చుట్టావని ఒక సందర్భంలో ఆవేషంతో నిలదీసినట్టు సమాచారం. అసలు కూల్చాలనే ఆలోచన ఎందుకు చేసినట్టు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెద్దలంటే లెక్కలేదా..?
ఎంతో సీనియారిటీ ఉన్న పార్టీలో పెద్దలెందరో సలహాలు, సూచనలు చేయడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం మర్చిపోతే ఎలా అని రాహుల్ ప్రశ్నించారు. ఈ విషయమై పెద్దలంటే లెక్కలేదా., లేదంటే వాళ్లు చెబితే వినేదేంటనే పొగరా.. అనే రీతిలో కూడా మందలించినట్టు సమాచారం. యోధానయోధులున్నా బాధ్యతలు అప్పగించినందుకు సరైన గుణపాఠమే చెప్పావ్ అనే రీతిలో తలంటారు. పార్టీ పార్టీ సీనియర్ల సలహాలు తీసుకోకుండా ఒంటెత్తు పోకడగా వెళ్లడం సరికాదని, మరోమారు ఇలాంటివిజరగకుండా చూసుకోవాలని మందలించారు.

కేసీ వేణుగోపాల్ కు రాహుల్ ఫోన్..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మార్గదర్శకత్వం చేయాలని రాహుల్ గాంధీ అప్పటికప్పుడు కేసీ వేణుగోపాల్ కు ఫోన్ లో ఆదేశించారు. రాష్ట్రంలో పార్టీకి జరుగుతున్న డ్యామేజ్ ను నిలువరించేలా గైడ్ చేయాలని కోరారు. దీంతో అప్పటికప్పుడు సీఎం రేవంత్ ఢిల్లోలో కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య చాలా వాడివేడిగా చర్చ జరిగినట్టు సమాచారం. ప్రజల మానసిక స్థితి, ప్రతిపక్షాల చేస్తున్న ఆందోళనలు, పార్టీలో సీనియర్లు ఇప్పటికే పాలనా వ్యవహారాలపై చేసిన ఫిర్యాదులన్నీ ఇద్దరూ చర్చించారు.

ఇతర రాష్ట్రాల్లో ప్రభావం..
సీనియర్లు చేసిన ఫిర్యాదులపై ప్రధాన చర్చ సాగింది. ఈ క్రమంలో మీరు చేస్తున్న పనులతో పార్టీకి ఇతర రాష్ట్రాల్లోచెడ్డపేరు వచ్చే ప్రమాదం దాపురించిందని ఆగ్రహించారు. సొంత ఆలోచనలుచ, స్వకార్యం తో పార్టీకి ఇబ్బందులు కలిగించొద్దని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ అంటే నీ ఒక్కడిదే కాదుకదా., దేశమంతా పరిశీలిస్తుందనే విచక్షణ కూడా మరిస్తే ఎలా అని చురకలంటించారు. హైకమాండ్ఆదేశాలు బేఖాతరు చేస్తే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని, ఒక్కరిద్దరి చేష్టలతో పార్టీ పరువు పోతుందని తెలిస్తే ఎలాంటి నిర్ణయానికైనా వెనకాడేది ఉండదని హెచ్చరించారు. పార్టీలో సీఎం అయినా, సామాన్య కార్యకర్త అయినా సరే అధిష్టానం, పార్టీ పెద్దల ఆదేశాలు తూచతప్పకుండా పాటించాల్సిందే అని వార్నింగ్ ఇచ్చారు. ఏది ఏమైనా సీఎం రేవంత్ కు హైడ్రా అధిష్టానం నుంచి విపరీతమైన తలంటిపోతను మిగిల్చింది. ఇంకా మున్ముందు ఏమేం పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి మరి..

RELATED ARTICLES

తాజా వార్తలు