న్యూఢిల్లీ: వాళ్లు కిక్కిరిసిన ఆర్టీసీ బస్సులో (RTC Bus) ప్రయాణిస్తున్నారు. బస్సులో చివరి వరుసలో కిటికీ వద్ద కూర్చున్నారు. ఒకే సీట్లో కూర్చున్న ఇద్దరు మెల్లగా రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్లారు. జనాల మధ్య ఉన్న విషయం మర్చిపోయి అంతా చూస్తుండగానే ముద్దులు పెట్టుకున్నారు. ఈ తతంగాన్నంతా వారి ముందు సీట్లో కూర్చున్న ఓ వ్యక్తి తన ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఒడిశాలోని రూర్కెలాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
అయితే అది ఢిల్లీలో జరిగినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఒడిశాలోని రూర్కెలాలో ఆర్టీసీ బస్సులో చోటుచేసుకున్నది. ప్రయాణికులతో రద్దీగా ఉన్న బస్సులో ఎక్కిన ఆ యువ జంట.. చివరి సీట్‌లో కూర్చుని రొమాన్స్ చేశారు. వారి పక్కకే ఓ వృద్ధురాలు కూడా కూర్చుని ఉన్నది. అదేవిధంగా వారి సీటు పక్కనే కండక్టర్ కూడా నిలబడి ఉన్నాడు. చిన్నపిల్లలు మహిళలతో కిక్కిరిసిన బస్సులో వారు అలా చేయడంతో నెటిజన్లు విమర్శిస్తున్నారు.
मेट्रो के बाद दिल्ली की बसों में भी अश्लीलता फैलाई जा रही हैं. जमकर रोमांस और फोरेप्ले चल रहा है. सोचिए बस में छोटे बच्चे और महिलाएँ भी मौजूद हैं। बावजूद इसके सॉफ्ट कॉर्न परोसा जा रहा है. pic.twitter.com/NivhIt5mkz
— Shubham Sharma (@Shubham_fd) May 13, 2024
देखिए दिल्ली की बस में अश्लिलता का एक वीडियो वायरल हो रहा है pic.twitter.com/nqjyaLj6kN
— Lavely Bakshi (@lavelybakshi) May 13, 2024