Saturday, December 28, 2024
HomeNationalSitaram Yechuri | సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత

Sitaram Yechuri | సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(Sitaram Yechuri) కన్నుమూత
AIIMS లో చికిత్స పొందుతూ మృతి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నూమూశారు. శ్వాసకోశ సంబంధిత, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆగస్ట్ 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్సం పొందుతున్నారు. వెంటిలేటర్‌పై ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. చివరికి ఆయన పరిస్థితి విషమించడంతో సెప్టెంబర్ 12 గురువారం తుది శ్వాస విడిచారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సీతారాం ఏచూరి ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయన 25 రోజులుగా చికిత్స పొందుతున్నారు. 72 ఏళ్ల ఏచూరి సీపీఎం నేతకు ఇటీవల క్యాటరాక్ట్ ఆపరేషన్ కూడా జరిగింది. డాక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డి, డాక్టర్‌ గౌరి నేతృత్వంలో వైద్య బృందం ఆయనకు చికిత్స అందించింది. అయితే ఇన్‌ఫెక్షన్‌ తొలగించేందుకు ఉపయోగించిన మందులు పనిచేయకపోవడంతో జపాన్‌ నుంచి ప్రత్యేక మందులు కూడా తెప్పించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. దీంతో కమ్యూనిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. అతను హైదరాబాద్‌లో పెరిగాడు. పదో తరగతి వరకు ఆల్ సెయింట్స్ హైస్కూల్లో చదివారు. 12వ పరీక్షలో దేశంలోనే ప్రథమ ర్యాంక్ సాధించారు. 1969 తెలంగాణ ఉద్యమం సమయంలో ఢిల్లీ చేరుకున్నారు. ఏచూరి ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్‌లో అడ్మిషన్ తీసుకున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ వన్ సాధించారు. అతను ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో మొదటి ర్యాంక్‌తో ఎకనామిక్స్‌లో తన బిఎ (ఆనర్స్) పూర్తి చేశారు. ఆ తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఏ చేశారు. పీహెచ్‌డీ కోసం జేఎన్‌యూలో అడ్మిషన్ తీసుకున్నారు. అయితే 1975లో ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయినందున పూర్తి చేయలేకపోయారు.
1974లో భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ)లో చేరిన ఏచూరి ఒక సంవత్సరం తరువాత అతను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) లో చేరారు. 1975లో సిపిఎంలో చేరారు. వరుసగా మూడుసార్లు జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఎమర్జెన్సీ తర్వాత, అతను ఒక సంవత్సరంలో (1977-78) మూడుసార్లు JNU స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కేరళ, బెంగాల్ నుండి కాకుండా SFI జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికైన మొదటి వ్యక్తిగా నిలిచారు.
ఏచూరి 1984లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. 1986లో ఎస్‌ఎఫ్‌ఐ నుంచి వైదొలిగారు. ఆ తర్వాత 1992లో జరిగిన పద్నాలుగో జాతీయ సమావేశాల్లో పొలిట్‌బ్యూరోకు ఎన్నికయ్యారు. ఏచూరి జూలై 2005లో పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 19 ఏప్రిల్ 2015న సీపీఐ(ఎం) ఐదవ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఏప్రిల్ 2018లో మళ్లీ సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఏప్రిల్ 2022లో, ఏచూరి మూడోసారి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
ఏచూరి భార్య సీమా చిస్తీ వృత్తిరీత్యా జర్నలిస్టు. తన భార్య తనకు ఆర్థికంగా సహకరిస్తుందని ఏచూరి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అతని మొదటి వివాహం వీణా మజుందార్ కుమార్తె ఇంద్రాణి మజుందార్‌తో జరిగింది. ఈ వివాహంలో అతనికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఏచూరి కుమారుడు ఆశిష్ ఏప్రిల్ 22, 2021న 34 ఏళ్ల వయసులో కొవిడ్​ కారణంగా మరణించారు.

RELATED ARTICLES

తాజా వార్తలు