CSK vs RR| తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై మంచి విజయం సాధించింది. సొంతమైదానంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టడంతో తమ ఖాతాలో మరో విజయాన్ని చేర్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (47*; 35 బంతుల్లో, 1×4, 3×6) ఒక్కడే విలువైన పరుగులు చేశాడు. అతను మినహా మిగిలిన బ్యాటర్లు అందరు త్వరగా పెవీలియన్ చేరడంతో పెద్దగా స్కోరు చేయేలకపోయింది. అయితే సీఎస్కే బౌలర్లలో సిమర్జీత్ సింగ్ (3/26) మూడు, తుషార్ దేశ్‌పాండే (2/30) రెండు వికెట్లు తీసారు.
స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ చెన్నై కాస్త ఆచితూచి ఆడింది. రచిన్ రవీంద్ర (27; 18 బంతుల్లో, 1×4, 2×6), డారిల్ మిచెల్ (22; 13 బంతుల్లో, 4×4) దూకుడుగా ఆడగా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (42*; 41 బంతుల్లో, 1×4, 2×6) వికెట్ పడిపోకుండా జాగ్రత్తగా ఆడుతూ చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ గెలిపించాడు. చెన్నై సూపర్ కింగ్స్ 18.2 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ రెండు, బర్గర్, చాహల్ చెరో వికెట్ తీశారు.అయితే శివమ్ దుబే (18) , మొయిన్ (10), జడేజా (5) నిరాశ పరచగా, రిజ్వీ 15 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
ఇక ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. 16వ ఓవర్‌లో అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో జడేజా థర్డ్ మ్యాన్ దిశగా షాట్ ఆడి సింగిల్ తీసాడు. అయితే రెండో పరుగు కోసం ప్రయత్నించగా, మరో ఎండ్‌లో ఉన్న రుతురాజ్ నిరాశకరించడంతో జడేజా వెనక్కి వెళ్లాడు. అయితే కీపర్ చేతికి బాల్ దొరకడంతో వికెట్స్ వైపు విసిరాడు. కాని జడేజా వికెట్ల వైపు అడ్డంగా పరుగెత్తడంతో రాజస్తాన్ ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో థర్డ్ అంపైర్ పరిశీలించి ఔట్ ఇచ్చాడు. జడేజా ఉద్దేశపూర్వకంగానే వికెట్ల వైపు పరుగెత్తాడని భావించి ఔట్ ఒచ్చాడు. ఐపీఎల్ చరిత్రలో అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కారణంగా ఔటైన మూడో ప్లేయర్‌గా నిలిచాడు. గతంలో యూసఫ్ పఠాన్, అమిత్ మిశ్రా ఇదే తరహాలో ఔటయ్యారు.