Sunday, December 29, 2024
HomeNationalCyclone Remal | రెమాల్ తుపాను ఎఫెక్ట్.. ప‌శ్చిమ బెంగాల్‌లో హైఅల‌ర్ట్

Cyclone Remal | రెమాల్ తుపాను ఎఫెక్ట్.. ప‌శ్చిమ బెంగాల్‌లో హైఅల‌ర్ట్

Cyclone Remal | హైద‌రాబాద్ : రెమాల్ తుపాను ముంచుకొస్తుంది. ఈ తుపాను ప్ర‌భావంతో ప‌శ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఈదురుగాలుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. తుపాను దృష్ట్యా బెంగాల్‌లో హై అలర్ట్ ప్రకటించారు. 21 గంటల పాటు విమానాశ్రయాన్ని మూసివేశారు. వందలాది రైళ్లను రద్దు చేశారు. ఈ తుఫాను ప్రభావంతో ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, కోల్‌కతా, తూర్పు మిడ్నాపూర్, హౌరా, హుగ్లీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. 24 పరగణాలు, తూర్పు మిడ్నాపూర్‌లో కొన్ని చోట్ల అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉంది. పశ్చిమ మేదినీపూర్, నదియా, తూర్పు బుర్ద్వాన్‌లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

సోమవారం నదియా, ముర్షిదాబాద్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోల్‌కతా, హౌరా, 24 పరగణాలు, హుగ్లీ, బీర్భూమ్, తూర్పు బుర్ద్వాన్‌లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. దక్షిణ బెంగాల్‌లోని మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదివారం రెండు 24 పరగణాల్లో వర్షంతో పాటు గంటకు 100 నుంచి 120 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. కోల్‌కతా, హౌరా, హుగ్లీ, తూర్పు మిడ్నాపూర్‌లలో గాలి వేగం గంటకు 70 నుండి 80 కి.మీ. తుఫాను గరిష్ట వేగం తాత్కాలికంగా గంటకు 90 కి.మీ. ఉంటుందని ఐఎండీ తెలిపింది.

రెమాల్ తుఫాన్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మరోసారి భారీ వర్షం పడింది. ప్రధానంగా.. నగరం శివారు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. పెద్దఅంబర్‌పేట్‌, హయత్‌నగర్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్‌, నాచారం, హబ్సిగూడలో వాన పడింది. కీసర, ఘట్‌కేసర్ మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. రెమాల్‌ ప్రభావం పొరుగు రాష్ట్రం ఏపీపై పెద్దగా లేనప్పటికీ.. పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది.

RELATED ARTICLES

తాజా వార్తలు