Sunday, December 29, 2024
HomeCinemaDevara| వెకేష‌న్ పూర్తి చేసుకున్న దేవ‌ర‌.. మ‌ళ్లీ హైద‌రాబాద్‌లో ల్యాండ్‌.. ఇక జోరు మాములుగా ఉండదు.!

Devara| వెకేష‌న్ పూర్తి చేసుకున్న దేవ‌ర‌.. మ‌ళ్లీ హైద‌రాబాద్‌లో ల్యాండ్‌.. ఇక జోరు మాములుగా ఉండదు.!

Devara| యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ త‌ర్వాత చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ దేవ‌ర‌. ఈ సినిమా భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతుంది. పాన్ ఇండియా స్థాయిలో వస్తోన్న ఈ మూవీ రెండు పార్టులుగా విడుదల కానుండగా.. దేవర పార్టు 1 అక్టోబర్‌ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా దేవర నుంచి ఇటీవలే ఫియర్ సాంగ్ ను లాంఛ్ చేశారు మేకర్స్‌. అనిరుధ్‌ రవిచందర్‌ కంపోజ్‌ చేసిన ఈ పాట నెట్టింట గూస్‌బంప్స్‌ తెప్పిస్తోంది. ఫియర్‌ సాంగ్ టాప్‌ వన్‌ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఫిషింగ్‌ హార్బర్‌ విలేజ్‌, పోర్ట్ మాఫియా నేపథ్యంలో వస్తోన్న దేవర గ్లింప్స్‌ ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. ఈ భామకు దేవర తెలుగు డెబ్యూ ప్రాజెక్ట్‌.

 

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న “దేవర” సినిమా కోసం ఎన్టీఆర్ ఎంతగా హార్డ్ వర్క్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా చేస్తూనే మ‌రోవైపు ఎన్టీఆర్ వార్ 2 అనే చిత్ర షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ కారణంగా ఆయన కొంత కాలంగా బిజీగా ఉన్నారు. అయితే సినిమాల‌కి కాస్త బ్రేక్ ఇచ్చిన జూనియ‌ర్ ఎన్టీఆర్ తన 41వ పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి వెకేషన్ ప్లాన్ చేశారు. విదేశాలకు వెళ్లి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తారక్ మళ్ళీ జెట్ స్పీడ్ లో హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు.తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి మీడియా ముందు కనిపించిన తారక్, అక్కడ అందరికి హాయ్ చెప్పాడు. ఇక త్వరలోనే “వార్ 2” చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో, తారక్ ప్రత్యేకంగా ఈ విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు తీరిక లేకుండా కష్టపడాల్సిన టైమ్ వచ్చింది.

“దేవర” చిత్ర పనులను పూర్తిచేయడానికి సిద్ధమవుతున్నారు ఎన్టీఆర్. ఒక భారీ షెడ్యూల్‌తో ఈ చిత్ర షూటింగ్‌ను ముగించాలని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత తారక్ “వార్ 2” షూటింగ్‌లో మరింత బిజీ కాబోతున్నాడు యంగ్ టైగ‌ర్. దేవ‌ర మొదటి భాగం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ మంచి హ‌ట్ త‌న ఖాతాలో వేసుకోవాల‌ని భావిస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయితే మాత్రం ఎన్టీఆర్ క్రేజ్ మరో లెవ‌ల్‌లో ఉంటుంది.

RELATED ARTICLES

తాజా వార్తలు