Devara| ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. ఈ మూవీ కొరటాల శివ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. చిత్రంలో ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకం అని కొరటాల శివ చెప్పడంతో మూవీపై అంచనాలు బాగా పెరిగాయి. ఈ సినిమాని రెండు పార్ట్‌లుగా విడుదల చేయబోతున్నారు. తొలిపార్ట్‌ని అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. మూవీని దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నారు. శ్రీకాంత్ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ మూవీ అప్‌డేట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, మే 20న ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా కొద్ది సేపటి క్రితం ఫియర్ సాంగ్ విడుదల చేశారు. ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంది. ఈ సాంగ్ ని చెన్నై లో ప్రత్యేకంగా షూట్ చేశారు. అనిరుధ్ తన స్టైలిష్ లుక్ తో దేవరకు అదిరిపోయే ఎలివేషన్స్ ఇవ్వగా, ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా ఫెరోషియస్ గా డిజైన్ చేసినట్టు కనిపిస్తుంది. శత్రుసంహారానికి పూనుకుంటే రక్తం ఏరులై పారాల్సిందే. సముద్రపు కెరటాలు ఎరుపెక్కాల్సిందే. దేవర మూవీలో ఎన్టీఆర్ పాత్ర తీరు తెలియజేసేలా ఫియర్ సాంగ్ ఉంది. అనిరుధ్ ట్యూన్స్ తో పాటు ఆయన పాడిన తీరు ఆకట్టుకుంది. రామజోగయ్య సాహిత్యం పాటను మరింత మాస్ అండ్ వైల్డ్ గా మార్చింది. రామజోగయ్య శాస్త్రి వాడిన పదాలు గూస్ బంప్స్ రేపుతున్నాయి. సాంగ్ విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ పాటలో మరో హైలెట్ గా చెప్పుకోవచ్చు.