Devara| యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ దేవర. ఈ మూవీపై అభిమానులలో ఏ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఎన్టీఆర్ 30 మూవీగా ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఫ్యాన్స్కి పిచ్చెక్కిస్తున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఫియర్ అనే సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీకి సంబంధించిన ఏదైన అప్‌డేట్ బయటకు వస్తుందా అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సమయంలో చిత్రంలో రౌడీల్లో ఒకరిగా నటించిన జూనియర్ ఆర్టిస్ట్ సినిమా గురించి అద్భుతంగా చెబుతూనే కథ మొత్తం రివీల్ చేశాడు.
ఎన్టీఆర్ సముద్రం దగ్గర పది ఊర్లకు కాపరిగా ఉంటాడని చెప్పిన అతను, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా దేవర ముందుండి చూసుకుంటాడని తెలియజేశాడు. సముద్రం దగ్గర ఫైట్ సీన్ అద్భుతంగా ఉంటుంది. ఏకంగా పదివేల మందితో ఫైట్ సీన్ తో సముద్రం అంతా రక్తంతో నిండిపోద్ది. యాక్షన్ సీన్స్ ని మేము లైవ్ లో చూసి థ్రిల్ అయ్యాం. ఆయన సింగిల్ టేక్‌లో డైలాగ్ చెప్పేవారు. ఎన్టీఆర్ నటన లైవ్‌లో చూశాక మా మైండ్ బ్లాక్ అయింది. సినిమా రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. థియేటర్స్ బద్దలు కావడం ఖాయం అని చెప్పి సినిమాపై మరింత హైప్ పెంచాడు. భారీ యాక్షన్ సీన్స్ తో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారట కొరటాల. సముద్రపు మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అండర్ వాటర్ సీన్స్ ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయట.
ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని గోవాలో సన్నివేశాలు షూట్ చేశారట కొరటాల. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా , బాలీవుడ్ యాక్టర్స్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో కనిపించి సందడి చేయనున్నాడు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ రేంజ్‌లో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారట. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్త సమర్పణలో భారీ రేంజ్ లో ఈ దేవర సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ సముద్ర వీరుడిగా ఎన్టీఆర్ కనిపించనున్నారు. రెండు పార్ట్‌లుగా రానున్న ఈ సినిమా తొలి పార్ట్ అక్టోబర్ 10, 2024న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది.