Monday, December 30, 2024
HomeSportsDinesh Karthik| క‌న్నీటితో ఐపీఎల్‌కి వీడ్కోలు ప‌లికిన దినేష్ కార్తీక్.. వీడియో వైర‌ల్

Dinesh Karthik| క‌న్నీటితో ఐపీఎల్‌కి వీడ్కోలు ప‌లికిన దినేష్ కార్తీక్.. వీడియో వైర‌ల్

Dinesh Karthik| ఐపీఎల్‌లో అస‌మాన బ్యాటింగ్‌తో అంద‌రిని అల‌రించిన దినేష్ కార్తీక్ బుధ‌వారం రాత్రి ఆర్ఆర్‌తో మ్యాచ్ జ‌రిగిన త‌ర్వాత ఐపీఎల్‌కి గుడ్ బై చెబుతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. ఓ వైపు లీగ్‌కు వీడ్కోలు పలికిన బాధ, మరోవైపు టోర్నీ నుంచి ఆర్సీబీ నిష్క్రమించింద‌న్న నిరాశ‌తో దినేష్ కార్తీక్ మైదానాన్ని వీడాడు. దినేశ్ కార్తీక్ అధికారికంగా సోషల్ మీడియాలో త‌న రిటైర్మెంట్ గురించి ప్ర‌క‌టించ‌లేద. కాక‌పోతే మ్యాచ్ అనంత‌రం తాను ఈ నిర్ణ‌యాన్ని ఇన్‌డైరెక్ట్‌గా వెల్ల‌డించిన‌ట్టు తెలుస్తుంది. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభంలో ఇదే తన చివరి ఐపీఎల్ అని దినేశ్ చెప్ప‌డం మ‌నం చూశాం. అయితే రాజస్థాన్‌తో జ‌రిగిన‌ మ్యాచ్‌లో ఓటమి అనంతరం అర్ధంతరంగా లీగ్ నుంచి తప్పుకున్నాడు.

రాజస్థాన్ పై ఆర్సీబీ ఓటమి తరువాత దినేష్ కార్తీక్ వద్దకు వచ్చిన విరాట్ కోహ్లీ భావోద్వేగంతో హగ్ చేసుకున్నాడు. ఇక ఆర్సీబీ కెప్టెన్ డూప్లిసెస్, కోహ్లీతోపాటు ఇతర ఆర్సీబీ ఆట‌గాళ్లు అంద‌రు కూడా దినేశ్ కార్తీక్ కు గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తూ ముందుకు న‌డిచారు. దినేశ్ కార్తీక్ కు అటువైపు ఇటువైపు డూప్లెసిస్, విరాట్ కోహ్లీ నడుస్తూ చప్పట్లు కొడుతుండగా.. దినేశ్ కార్తీక్ స్టేడియంలోని అభిమానులకు అభివాదం చేస్తూ డ‌గౌట్ వైపు న‌డిచారు. ఆ స‌మ‌యంలో కొద్దిసేపు నరేంద్ర మోదీ స్టేడియం డీకే డీకే అనే నినాదాలతో మారుమోగిపోయింది. ఇక డీకే త‌న‌ రిటైర్మెంట్ గురించి అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించ‌క‌పోయిన కూడా త‌న హావభావాల‌తో తెలియ‌జేశాడ‌ని కొంద‌రు చెబుతున్నారు.

ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఇప్పటివరకు త‌న అద్భుత‌మైన ఆట‌తీరుని క‌న‌బ‌రుస్తూ వ‌చ్చారు దినేష్ కార్తీక్. లీగ్‌లో తన ప్రయాణాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ డేర్‌డెవిల్స్) తో మొద‌లు పెట్ట‌గా, ఆ త‌ర్వాత ఆర్సీబీ, ముంబై ఇండియ‌న్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ వంటి ఫ్రాంచైజీల‌కి ఆడాడు. ముంబై ఫ్రాంచైజీకి ఆడుతున్న‌ప్పుడు డీకే పేరు బాగా మారుమ్రోగింది. కేకేఆర్ తరఫున సారథి బాధ్యతలు కూడా నిర్వర్తించాడు. ఐపీఎల్‌లో 257 మ్యాచ్‌లు ఆడిన డీకే 26.32 సగటు, 135 స్ట్రైక్‌రేటుతో 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆర్సీబీ తరఫున ఫినిషర్ పాత్రలో కార్తీక్ అద్భుతంగా మెరిసాడు. ఆయ‌న రిటైర్మెంట్ విష‌యం తెలిసి ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు. ఆర్సీబీకి టైటిల్ అందించి త‌ప్పుకుంటే బాగుండేది అని అంటున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు