Health Tips | రెగ్యులర్‌గా ప్రతి రోజు బ్రేక్ ఫాస్ట్ చేస్తుంటాం. కానీ ఏ సమయానికి బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నామనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రేక్ ఫాస్ట్ టైమింగ్స్‌లో తేడా వస్తే అనారోగ్య సమస్యలు తప్పవని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ విషయంలో కచ్చితమైన టైమింగ్స్ పాటించాలని సూచిస్తున్నారు. అల్పాహారం తీసుకునే విషయంలో ఏవైనా తేడాలు వస్తే.. మధుమేహం బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. మార్నింగ్ 9 తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేసే వారితో పోలిస్తే ఉదయం 8 గంటల్లోపే అల్పాహారం తిన్న వారికి మధుమేహం ముప్పు 59 శాతం వరకు తగ్గుతున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది.
అల్పాహారం మానేసి వారిలో కూడా గ్లూకోజ్, కొలెస్ట్రాల్ నియంత్రణ తప్పుతుంది. దీంతో ఇన్సులిన్ హార్మోన్ మోతాదులూ అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ మానేయడం కానీ, సమయానికి తినకపోవడం కానీ చేయకూడదు. కచ్చితంగా ఉదయం 8 లోపు బ్రేక్ ఫాస్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి.
ఐఎస్ గ్లోబల్ అధ్యయనం ప్రకారం.. మొత్తం 1,03,312 మంది ఆహారపు అలవాట్లను విశ్లేషించారు. తొలి రెండేళ్ల సగటు ఆహార పద్ధతుల ఆధారంగా ఏడేండ్లకు పైగా వారి ఆరోగ్య తీరుతెన్నులను పరిశీలించారు. వీరిలో కొత్తగా 963 మంది మధుమేహం బారిన పడగా, రోజు ఉదయం 9 తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేసిన వారికి డయాబెటిక్ ముప్పు గణనీయంగా పెరిగినట్లు పరిశోధనల్లో తేలింది.
ఉదయం బ్రేక్ ఫాస్టే కాదు.. రాత్రి 10 తర్వాత డిన్నర్ చేసే వారిలో కూడా డయాబెటిక్ ముప్పు పెరుగుతున్నట్లు పరిశోధకలు గుర్తించారు. ఉదయం 8 గంటల్లోపు, రాత్రి డిన్నర్ 7 లోపు చేసే వారిలో డయాబెటిక్ మప్పు తగ్గుతున్నట్లు తేలింది. ఈ టైమింగ్స్ పాటించిన వారిలో రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతున్నట్లు పరిశోధనల్లో గుర్తించడం జరిగింది.