Friday, April 4, 2025
HomeCinemaPavithra Jayaram| పవిత్ర జయరాం వయస్సు 53 ఏళ్లు.. చంద్ర‌కాంత్ ఆమె క‌న్నా అంత చిన్నవాడా..!

Pavithra Jayaram| పవిత్ర జయరాం వయస్సు 53 ఏళ్లు.. చంద్ర‌కాంత్ ఆమె క‌న్నా అంత చిన్నవాడా..!

Pavithra Jayaram| ఇటీవ‌ల ఇండ‌స్ట్రీలో జ‌రిగిన రెండు మ‌ర‌ణాలు ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో క‌లిచి వేశాయి. కొద్ది రోజుల క్రితం జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సీరియల్‌ నటి పవిత్ర జయరామ్ క‌న్నుమూసింది. ఈ ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే మృతి చెందగా.. కారులో ఆమెతో ప్రయాణం చేస్తున్న ప్రియుడు చంద్ర‌కాంత్ గాయపడ్డారు. అయితే ప‌విత్ర మ‌రణం త‌ర్వాత చంద్ర‌కాంత్ చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు.పవిత్ర‌తో కలిసి తాను దిగిన చివరి ఫోటోను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘పాప నీతో దిగిన లాస్ట్ ఫోటో. నువ్వు నన్ను ఒంటరిగా వదిలేశావన్నది నేను జీర్ణించుకోలేకపోతున్నా. ఒక్కసారి మామ అని పిలువే ప్లీజ్. వెనక్కి రా ప్లీజ్. నా పవి ఇక లేదు’ అని రాసుకొచ్చాడు.

అయితే ప‌విత్ర మ‌ర‌ణాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేని చంద్ర‌కాంత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందాడు. ఐదు రోజుల గ్యాప్‌తో ఈ ఇద్ద‌రు మ‌ర‌ణించ‌డం ప్ర‌తి ఒక్కరిని క‌లిచి వేసింది. అయితే వీరి మ‌ర‌ణం త‌ర్వాత వారికి సంబంధించిన అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల‌గులోకి వ‌స్తున్నాయి. మాండ్యకు చెందిన పవిత్ర పెద్దగా చదువుకోలేదు. పెద్ద చదువులు లేకపోవడంతో.. చిన్న చిన్న ఉద్యోగాలు చేసింది. ఇలాంటి సమయంలోనే పవిత్ర స్నేహితురాలు.. ఆమెను ఇండస్ట్రీ వైపు ప్రోత్సాహించింది. స్నేహితురాలి సలహా మేరకు పవిత్ర.. డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరింది. ఆ తర్వాత బుల్లితెర మీద కనిపించాలనే ఉద్దేశంతో ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో తొలిసారి జొకాలి అనే కన్నడ సీరియల్లో ఆమెకు అవకాశం లభించింది.

తెలుగులో ముందుగా నిన్నే పెళ్లాడతా సీరియల్‌లో నటించింది పవిత్ర.అప్పుడు తెలుగు రాక చాలా ఇబ్బంది ప‌డింది. అయితే త‌ర్వాత త‌ర్వాత అల‌వాటైంది. త్రినయని సీరియల్‌తో తెలుగులో ఆమె కెరీర్‌ మలుపు తిరిగిందని చెప్పవచ్చు.అయితే ఈ సీరియ‌ల్ స‌మయంలో చంద్ర‌కాంత్ ఆమెకి ప‌రిచ‌యం కావ‌డం వారి ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డం జ‌రిగింది. వీరు పెళ్లి కూడా చేసుకోవాల‌ని అనుకున్నారు. కాని విధి వింత నాట‌కం ఆడింది. అయితే పవిత్ర వ‌య‌స్సు 53 ఏళ్లు అని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమెకి పెద్ద పిల్ల‌లే ఉన్నారు.16 ఏళ్ల వ‌య‌స్సులో పెళ్లి చేసుకున్న ప‌విత్ర‌కి కొడుకు ఉండ‌గా, అత‌ని వ‌య‌స్సు 22 ఏళ్లు, కుమార్తెకు 19 ఏళ్లు. వారి చిన్నతనంలోనే భర్త నుంచి విడిపోయింది. ఇక చంద్ర‌కాంత్ వ‌య‌స్సుపై క‌రెక్ట్ క్లారిటీ లేదు కాని 35 ఏళ్లు అలా ఉంటాయ‌ని అంటున్నారు. ఇంత చిన్న‌వాడితో ప‌విత్ర జ‌య‌రాం ప్రేమాయ‌ణం న‌డిపిందా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

RELATED ARTICLES

తాజా వార్తలు