కొమరయ్య 1927 ఏప్రిల్ 3న తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, దేవరుప్పుల మండలంలోని కడవెండి గ్రామంలో సాధారణ గొర్రెల పెంపకందార్ల కుటుంబంలో జన్మించాడు. ఇతని అన్న దొడ్డి మల్లయ్య కమ్యూనిస్టు పార్టీ గ్రామ నాయకుడు. హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణా సాయుధ పోరాటంగా పిలుస్తారు.
విసునూర్ దేశ్‌ముఖ్ రామచంద్రా రెడ్డి తల్లి జానకమ్మా దొరసాని. ఆమె కడికవెండిలో వుండేది. ఈమె ప్రజల పట్ల అతి క్రూరంగా వ్యవహరించేది. మనషులను వెట్టిచాకిరి చేయించడంలో వడ్డీలు వసూలు చేయడంలో రకరకాల శిక్షలు, జరిమానాలు విధించడంలో పేరుగాంచింది.
వెట్టి చాకిరి కి దొపిడికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాట సేనాని ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కడివెండి వెళ్లి ఆంధ్ర మహా సభ సందేశాన్ని ప్ర్ర్రజలకు వినిపించాడు. దీంతో గ్రామంలో సంఘమేర్పడింది. ఉత్సాహంగా యువతీ యువకులు ముందుకొచ్చారు. దిన దినంగా కడివెండిలో సంఘం బలంగా అయింది. వెట్టచాకిరిని నిర్మూలించారు. దొరలు, విసునూర్ ల ఆటలను అరికట్టించారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననూ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేక పోయారు. దేశమంతటా స్వాతంత్ర్యోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు.
1946 జులై 4 న విసునూర్ నైజాం అల్లరి మూకలు రౌడీలతో 40 మంది వచ్చారు. ప్రజలంతా ఏకమై కర్రలు, బడిశెలు, గునపాలు అందుకుని విసునూర్, నిజాం, రజాకర్లను తరిమికొట్టారు. నైజాం అల్లరి మూకలు, విసునూర్ తుపాకి తూటాలకు నేలరాలిన అరుణతార, తెలంగాణ విప్లవంలో చెరగని ముద్రవేసుకున్నాడు దొడ్డి కొమురయ్య. మరణ వార్త జనగాం ప్రాంత ఆంధ్రమహాసభ కార్యకర్తలందరకీ విషాదకరమైన వార్తయింది. దేశ్‌ముఖ్, విసు నూర్ ఆగడాలన ఎదుర్కోవవడానికి పాలకుర్తి ప్రాంతం నుంచి యాదగిరిరావు, నిర్మల్ కృష్ణమూర్తి, నాయకత్వంలో ఆరు వేల మంది ప్రజాసైన్యం దొడ్డి కొమరయ్య మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. వేలాది మంది జనం నాయకత్వంలో అంతిమ యాత్ర జరిగింది.