Double Ismart| రామ్ పోతినేని ప్రధాన పాత్రలో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2019లో వచ్చి సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమాకు సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ అనే చిత్రం గత కొద్ది రోజులుగా చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే మరోసారి పూరి జగన్నాథ్-రామ్ పోతినేని కాంబోలో సినిమా కావడంతో ఈ మూవీ ప్రేక్షకులకి మంచి కిక్ ఇస్తుందని అందరు భావిస్తున్నారు. ముంబైలో ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అద్భుతమైన రీ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తుంది. నేడు రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ రామ్‌కి బర్త్ డే విషెస్ తెలుపుతూ.. డబుల్ ఇస్మార్ట్ టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఇక టీజర్‌లో సంజయ్ దత్ పాత్రను చాలా వయోలెంట్‌గా చూపించారు. బిగ్ బుల్ పాత్రలో సంజయ్ దత్ కనిపించి సందడి చేశారు. ఇక టీజర్‌లో గన్‌ల మోతతో పాటు తెలంగాణ స్లాంగ్‌లో రామ్ పోతినేని డైలాగులు వినిపించాయి. ఇందులో హీరోయిన్‌గా కావ్య థాపర్ కనిపించింది. రామ్ ఫ్రెండ్ పాత్రలో గెటప్ శీను కనిపించాడు. అలానే షియాజీ షిండే, ఉత్తేజ్, ఆలీ టీజర్‌లో కనిఇపంచింది సందడి చేశారు. మొత్తానికి రామ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ దీపావళి టపాసులా గట్టిగానే పేలింది. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, రామ్ అభిమానులు కూడా తెగ వైరల్ చేస్తున్నారు.