బీ ఆర్ ఎస్ నేత డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్
…నిరుద్యోగులు ,విద్యార్థుల పై సీఎం ,మంత్రులు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు
…ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలనే నిరుద్యోగులు గుర్తు చేస్తున్నారు
..జాబ్ క్యాలండర్ ఏమైంది ,మెగా డీఎస్సీ ఏమైందని వారు అడుగుతున్నారు
..సీఎం ,మంత్రులు వారికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదు
..కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుంది కాంగ్రెస్ వైఖరి
..కాంగ్రెస్ లాగా బీ ఆర్ ఎస్ నిరుద్యోగుల విషయం లో చిల్లర రాజకీయాలు చేయదు
..నిరుద్యోగులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా కాంగ్రెస్ నేతలు డొంక తిరుగుడు మాటలు చెబుతున్నారు
..గ్రూప్ వన్ విషయం లో 1: 100 పిలుస్తామన్నది కాంగ్రెస్ నేతలే
..భట్టి విక్రమార్క స్వయంగా అసెంబ్లీ లో డిమాండ్ చేశారు
..సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండరు ఇచ్చామని అబద్దాలు చెప్పారు
..జాబ్ క్యాలండర్ ఎన్నికల కోడ్ కారణంగా ఇవ్వలేక పోయామని మంత్రి పొన్నం అన్నారు
..సీఎం ,డిప్యూటీ సీఎం ,మంత్రి తలో రకంగా మాట్లాడుతున్నారు
..కాంగ్రెస్ మేనిఫెస్టో లో 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపే ఇస్తామన్నారు
..ఏఏ ఉద్యోగాలు ఎపుడు ఇస్తామనేది జాబ్ కేలండర్ లో చెప్పారు
..ఏడు నెలలు గడుస్తున్నా నోటిఫికెషన్లు ఇవ్వలేదు
..కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లతో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసి తామే భర్తీ చేశామని సిగ్గు లేకుండా చెబుతున్నారు
..30 వేల ఉద్యోగాలు మీరు భర్తీ చేయలేదని మేము నిరూపిస్తామ్ ..సీఎం ,మంత్రులు క్షమాపణ చెబుతారా
..జాబ్ కేలండర్ లో చెప్పిన ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికెషన్లు ఇచ్చినట్టు నిరూపిస్తే నేను ముక్కు నేలకు రాస్తా
…కాంగ్రెస్ మేనిఫెస్టో 41 ,42 పేజీల్లో నోటిఫికేషన్ల తేదీలు ఉన్నాయి ..వాటిని నిలుపుకోలేదు
..ఏ ఉద్యోగ నియామక పరీక్ష కు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని మేనిఫెస్టో లో చెప్పారు
..టెట్ ,డి ఎస్సీ ఫీజుల ద్వారానే 41 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది
…కాంగ్రెస్ మేనిఫెస్టో చెత్త గా మారింది ,కాంగ్రెస్ మాట మీద నిలబడే పార్టీ
..నయవంచనకు మారు పేరు కాంగ్రెస్ పార్టీ
…సీఎం రేవంత్ మాటలు చూసి ఉసరవెల్లులు కూడా సిగ్గు పడుతున్నాయి
..అన్ని వర్గాలను రేవంత్ మోసం చేస్తున్నారు
..కేసీఆర్ హయం లో 117 నోటిఫికేషన్లు ఇచ్చి లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం
..రేవంత్ ఇచ్చామంటున్న 30 వేల ఉద్యోగాల నోటిఫికెషన్ల తేదీ లు నేను వెల్లడిస్తున్నా ..దమ్ముంటే వాటి పై చర్చకు రావాలి
..గ్రూప్ 2 ,డీఎస్సీ కి మధ్య 45 రోజుల వ్యవధి కావాలని నిరుద్యోగులు అడగడం తప్పా
..సంధ్య అనే యవతి ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఆత్మహత్య చేసుకుంది
..గ్రూప్ వన్ మెయిన్స్ కు 1 : 57 ఎలా పిలిచారు
..రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించలేదు
..కాంగ్రెస్ కు కేసీఆర్ భయం పట్టుకుంది
…నిరుద్యోగుల ఉద్యమం రాజకీయపరమైంది కాదు
..నిరుద్యోగులు ప్రతి పక్షాల ట్రాప్ లో పడొద్దని మంత్రి పొన్నం అంటున్నారు
..నిరుద్యోగులు ఎవరి ట్రాప్ లో లేరు
…రేవంత్ స్వయంగా ఆర్డర్ కాపీలు ఇచ్చినా పోస్టింగ్ లు లేవంటే ప్రభుత్వం ఎలా పని చేస్తోందో అర్థం చేసుకోవచ్చు
..ఈ ప్రభుత్వం లో సీఎం మంత్రులకు ,మంత్రులకు అధికారులకు సమన్వయం లేదు
…ఆర్టీసీ ఉద్యోగాల విషయం లో మంత్రి మాటలకు ఎండీ మాటలకు పొంతన లేదు
…కంచెల పాలన లేదని ఓయూ లో కంచెలు వేశారు
..నిరుద్యోగుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుంది
..పోలీసులు నిరుద్యోగులు ,జర్నలిస్టుల పై చేస్తున్న దాడులను ఖండిస్తున్నాం
..కాంగ్రెస్ మేనిఫెస్టో ఓ బోగస్
..జాబ్ కేలండర్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే దాకా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం
ప్రెస్ మీట్ లో పల్లె రవి కుమార్ ,మన్నె గోవర్ధన్ రెడ్డి ,నాగేందర్ గౌడ్ ,గోసుల శ్రీనివాస్ యాదవ్ ,బొమ్మెర రామ మూర్తి తదితరులు పాల్గొన్నారు