Thursday, April 3, 2025
HomeBusinessRules Change | జూన్‌ నుంచి మారున్న రూల్స్‌ ఇవే..! గ్యాస్‌ సిలిండర్ నుంచి డ్రైవింగ్‌...

Rules Change | జూన్‌ నుంచి మారున్న రూల్స్‌ ఇవే..! గ్యాస్‌ సిలిండర్ నుంచి డ్రైవింగ్‌ లైసెన్సుల వరకు..!

Rules Change | మరో రెండురోజుల్లో మే నెల ముగియనున్నది. జూన్‌లో కొత్త పలు నిబంధనలు మారబోతున్నాయి. ఈ నిబంధనలు మన నిత్యజీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ఇందులో గ్యాస్‌, బ్యాంకులకు సెలవులు, ఆధార్‌ అప్‌డేట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు క్రెడిట్‌కార్డుల రూల్స్ సైతం ఉన్నాయి. ముందస్తుగా వీటి గురించి అవగాహన ఉంటే.. తర్వాత ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. జూన్‌ ఒకటి నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీలో భారీ మార్పులే చోటు చేసుకోబోతున్నాయి.

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ప్రైవేటు డ్రైవింగ్‌ శిక్షణ సంస్థలు జారీ లైసెన్స్‌లు జారీ చేసే అవకాశం కల్పించబోతున్నది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ప్రకటన చేసింది. కాలుష్య నివారణలో భాగంగా దాదాపు 9 లక్షల ప్రభుత్వ వాహనాలను దశల వారీగా స్క్రాప్‌గా మార్చబోతున్నారు. వేగంగా వాహనం నడిపితే రూ.1000 నుంచి రూ.2 వేల వరకు జరిమానా విధిస్తారు. పిల్లలు డ్రైవ్ చేస్తూ పట్టుబడితే రూ.25 వేల జరిమానాతో పాటు వాహన యజమాని రిజిస్ట్రేషన్‌ని రద్దు చేయనున్నారు. వాహనం నడిపిన మైనర్‌కు 25 ఏళ్లు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్‌ జారీచేయకుండా నిషేధం విధించనున్నారు.

ఇక గ్యాస్‌ సిలిండర్‌ ధరలను గ్యాస్‌ కంపెనీలు సవరించనున్నాయి. దాంతో ధరలు పెరగడం లేదంటే తగ్గే అవకాశాలుంటాయి. మేలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ స్వల్పంగా తగ్గాయి. జూన్‌ నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సైతం పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. మరో వైపు జూన్‌ మాసంలో బ్యాంకులు పదిరోజుల పాటు మూతపడనున్నాయి. ఈ మేరకు ఆర్‌బీఐ సెలవుల లిస్ట్‌ని విడుదల చేసింది. మరో వైపు ఐసీఐసీఐ బ్యాంక్‌ అమెజాన్‌ పే కార్డ్‌ రూల్స్‌ను మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇకపై అద్దె చెల్లింపులపై రివార్డ్‌లో కోత విధించింది. ఆధార్‌ అప్‌డేట్‌ గడువు సైతం ముగియనున్నది. ఇప్పటి ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుండగా.. గడువు ముగిసిన తర్వాత రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

RELATED ARTICLES

తాజా వార్తలు