Friday, April 4, 2025
HomeSportsMS Dhoni| ఏంటి..ధోని ఆ సిక్స్ వ‌ల్లే ఆర్సీబీ గెలిచిందా.. లేకుంటే సీఎస్కేదేనా విజ‌యం ?

MS Dhoni| ఏంటి..ధోని ఆ సిక్స్ వ‌ల్లే ఆర్సీబీ గెలిచిందా.. లేకుంటే సీఎస్కేదేనా విజ‌యం ?

MS Dhoni| గ‌త రాత్రి ఆర్సీబీ, చెన్నై మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ క్రికెట్ ప్రేమికుల‌కి మంచి మ‌జా ఇచ్చింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చెన్నైపై 27 ప‌రుగులు తేడాతో గెలిచింది. దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కి వెళ్లిపోయింది. అయితే ప్లే ఆఫ్స్‌కి చేరుకోవ‌డం చాలా క‌ష్టం అన్న ప‌రిస్థితుల్లో ఉన్న ఆర్సీబీ ప్లేఆఫ్స్‌లో స్థానం ద‌క్కించుకోవ‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఆర్సీబీ ప్లేఆప్స్ కు చేరుకోవడంతో ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అవదులు లేకుండాపోయాయి. అర్ధరాత్రి వేళ రోడ్లపైకి వచ్చి ఆర్సీబీ ఫ్యాన్స్ సందడి చేశారు.

రాత్రి 1.30 గంటల సమయంలో బెంగళూరు వీధుల్లో అభిమానులు పెద్ద సంఖ్యలో గుమ్మిగూడి సంబురాలు చేసుకున్నారు. ఈ వీడియోని ఆర్సీబీ తమ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేయ‌డం విశేషం. అయితే గెల‌వాల్సిన మ్యాచ్‌లో చెన్నై ఓట‌మి చెంద‌డంతో ఆ జ‌ట్టు ఫ్యాన్స్ నిరాశ‌లో ఉన్నారు. అలా ఎలా ఓడిపోయారు అంటూ విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. కఠిన పరిస్థితుల్లోనూ బ్యాటర్​గా ఆఖర్లో వచ్చి మెరుపు ఇన్నింగ్స్​లతో మ్యాచ్​ను చెన్నై వైపు తిప్పే ధోని ఈ సారి మాత్రం సొంత జట్టుని కాకుండా అపోజిషన్ టీమ్ ని గెలిపించాడ‌ని అంటున్నారు. చెన్నైని గెలిపించి ప్లేఆఫ్స్​కు తీసుకెళ్తాడని లెజెండ్ ఎంఎస్ ధోని మీద ఎల్లో ఆర్మీ గంపెడాశలు పెట్టుకుంది. అందుకు తగ్గట్లే అతడు కూడా ఆఖరి దాకా పోరాడాడు. కానీ అతడి కాంట్రిబ్యూషన్ సీఎస్​కేకు కాకుండా ఆర్సీబీకి బిగ్ హెల్ప్ చేసింది. సీఎస్​కే ఇన్నింగ్స్​ ఆఖరి ఓవర్ అది. విజయానికి 6 బంతుల్లో 17 పరుగులు చేయాలి.

యష్ దయాల్ వేసిన తొలి బంతికే భారీ సిక్స్ బాదాడు మాహీ. అది కాస్తా వెళ్లి చిన్నస్వామి స్టేడియం అవతల పడింది. ఆ బాల్ 110 మీటర్ల దూరం వెళ్లడంతో కనిపించకుండా పోయింది. దీంతో కొత్త బాల్​ తెప్పించారు అంపైర్లు. ఇక్కడే మ్యాచ్ టర్న్ అయింది. పాత బంతిని అలవోకగా బౌండరీలు, సిక్సులకు తరలించిన ధోని-జడ్డూ కొత్త బంతిని ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడ్డారు. కొత్త బంతితో బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్​ బాల్​ను సరిగ్గా వేశాడు బౌలర్ యష్ దయాల్. అప్పటివరకు ఉన్న పాత బంతితో అతడు బౌలింగ్ వేసేందుకు ఇబ్బందులు పడ్డాడు. గ్రౌండ్​లో ఉన్న తేమ వల్ల బంతి మీద పట్టు దొరక్కపోవడంతో అనుకున్నంత బాగా బౌలింగ్ చేయలేకపోయాడు. కానీ కొత్త బంతి దొరకగానే తన ప్రతాపం చూపించాడు. అయితే ధోని బాల్​ను బయటకు కొట్టకపోతే కొత్త బంతి వచ్చేది కాదు, ఆర్సీబీ నెగ్గేది కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

RELATED ARTICLES

తాజా వార్తలు