Friday, January 3, 2025
HomeNationalOoty-Kodaikanal | ఊటీ, కొడైకెనాల్‌ సందర్శనకు వెళ్తున్నారా..? మరి ఈ-పాస్‌ ఉందా..?

Ooty-Kodaikanal | ఊటీ, కొడైకెనాల్‌ సందర్శనకు వెళ్తున్నారా..? మరి ఈ-పాస్‌ ఉందా..?

Ooty-Kodaikanal | ఊటీ, కొడైకెనాల్‌ వెళ్లే పర్యాటకులకు అలెర్ట్‌. పర్యాటక అందాలను వీక్షించేందుకు వెళ్లేవారికి ప్రభుత్వం ఈ-పాస్‌ తప్పనిసరి చేసింది. మద్రాస్‌ హైకోర్టు ఆదేశాల మేరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్ ప్రక్రియను సోమవారం నుంచి తప్పనిసరి చేసింది. పర్యాటకులు తమ వివరాలతో పాటు వాహనాల నంబరు, పర్యాటక ప్రాంతాలకు వచ్చే రోజు, ఎన్నిరోజులు బస చేస్తారు ? ఎక్కడ బస చేస్తారనే వివరాలను నమోదు చేసుకొని.. ఈ-పాస్‌ పొందాల్సి ఉంటుంది. ఊటీ, కొడైకెనాల్ వెళ్లే టూరిస్టులు, వ్యాపారులు తప్పనిసరిగా epass.tnega.org వెబ్‌సైట్‌లో త‌మ వివ‌రాల‌ను న‌మోదు చేసి ఈ-పాస్ పొందవచ్చని తమిళనాడు గవర్నమెంట్‌ తెలిపింది. వాహ‌న ర‌ద్దీని క్రమబద్దీకరించేందుకు ఈ-పాస్‌ విధానం అమలులోకి తీసుకువచ్చిన సర్కారు తెలిపింది. ఈ విధానం జూన్‌ 31 వరకు మాత్రమే అమలులో ఉండనున్నది. ఈ-పాస్‌ జారీ విషయంలో ఎలాంటి పరిమితి ఉండదని స్పష్టం చేసింది.

RELATED ARTICLES

తాజా వార్తలు