Election Commission | ఎన్నికల అనంతరం సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరుస్తామంటూ ఆశచూపడం, ఓటర్ల పేర్లను నమోదు చేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను ఆదేశించింది. ప్రకటనలు, సర్వేలు, యాప్‌ల ద్వారా ఓటర్ల నమోదుకు సంబంధించిన కార్యకలాపాలను నిలిపివేయాలని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ఈసీ సూచించింది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. ఎన్నికల అనంతరం ప్రయోజనాలు ప్రయోజనాల వాగ్ధానం ప్రోత్సహిస్తే ఓటర్లు, వాగ్ధానాలు చేసిన వారి మధ్య ఇచ్చిపుచ్చుకునే అవగాహన ఏర్పడుతుందని పేర్కొంది.
అలాగే ఎన్నికల ప్రక్రియ సమగ్రను దెబ్బతీస్తుందని ఈసీ పేర్కొంది. ఈ విధానం ఓటర్లు, వాగ్ధానాలు చేసే వ్యక్తుల మధ్య రాజీకి దారి చేసే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఎన్నికలకు హామీలు ఇచ్చేందుకు అనుమతి ఉన్నప్పటికీ పథకాల పేరుతో ఆశ చూపి సర్వేల్లో ఓటర్ల పేరు నమోదు చేసుకుంటే.. నిజమైన సర్వేలు, రాజకీయ లబ్ధి చేకూర్చే పక్షపాత ప్రయత్నాల మధ్య వ్యత్యాసం అస్పష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, ఈ ప్రయత్నాలు చట్టబద్ధమైన సర్వేలు, ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ అజెండాలకు సంబంధించిన కార్యకలాపాలుగా కనిపించే అవకాశం ఉందని చెప్పింది. సమస్యను అధిగమించేందుకు జిల్లాల ఎన్నికల అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈసీ సూచించింది.