Friday, April 4, 2025
HomeAndhra PradeshYCP MLA Shiva Kumar | తెనాలి వైసీపీ ఎమ్మెల్యేపై ఈసీ ఆగ్ర‌హం.. గృహ‌నిర్బంధంలో ఉంచాల‌ని...

YCP MLA Shiva Kumar | తెనాలి వైసీపీ ఎమ్మెల్యేపై ఈసీ ఆగ్ర‌హం.. గృహ‌నిర్బంధంలో ఉంచాల‌ని ఆదేశం

గుంటూరు: తెనాలి వైసీపీ ఎమ్మెల్యే శివ‌కుమార్‌పై (YCP MLA Shiva Kumar ) ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఎమ్మెల్యేను వెంట‌నే అదుపులోకి తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించింది. పోలింగ్ పూర్త‌య్యే వ‌ర‌కూ శివ‌కుమార్‌ను గృహ నిర్బంధంలో ఉంచాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అస‌లేం జ‌రిగిందంటే..

గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పోలింగ్ స్టేష‌న్‌లోకి క్యూలో నిల‌బ‌డ‌కుండా నేరుగా వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో అక్క‌డ ఉన్న ఓట‌రు.. ఎమ్మెల్యేను నిల‌దీశారు. దీంతో ఆగ్ర‌హాంతో ఊగిపోయిన ఎమ్మెల్యే.. ఆ ఓట‌రుపై చేయి చేసుకున్నారు. బాధిత ఓట‌రు కూడా ఎమ్మెల్యేను తిరిగి కొట్టారు. దీంతో ఎమ్మెల్యే అనుచ‌రులు అత‌నిపై దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. దీంతో అక్క‌డ కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డించింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ‌డంతో విష‌యం కాస్తా ఈసీ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయ‌న‌ను అరెస్టు చేయాల‌ని, గృహ‌నిర్బంధంలో ఉంచాల‌ని ఆదేశించింది.

RELATED ARTICLES

తాజా వార్తలు