Eesha Rebba | అచ్చ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ. కెరియర్ తొలినాళ్లలో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకున్నది. అందంతో అభినయంతో అలరించింది. 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఆమె మొదటిసారిగా అంతక ముందు ఆ తర్వాత అనే చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నది. ఆ తర్వాత పలు చిత్రాల్లో అవకాశాల్లో నటించినా.. ప్రస్తుతం సినిమా అవకాశాలు కరువయ్యాయి. చేసింది సినిమాలు తక్కువే అయినా.. సోషల్ మీడియాలో ఫాయింగ్ ఎక్కువగానే ఉన్నది.
ఎప్పటికప్పుడు ఫొటోషూట్లతో అలరిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఈ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించింది. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అయితే ఇండస్ట్రీలో తెలుగు మాట్లాడే అమ్మాయిలు చాలా తక్కువమంది ఉన్నారని.. ఇప్పుడు చాలా మంది అయ్యారని పేర్కొంది. కోవిడ్, ఓటీటీ తర్వాత దర్శకులు, నిర్మాతలు తెలుగమ్మాయిలను క్యాస్ట్ చేసుకుంటున్నారని.. అందుకే చాలా మందిని చూడగలుగుతున్నామని.. ఈ విషయంలో తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. తెలుగు అమ్మాయిలను ప్రిఫర్ చేయరని తాను ఇంతకు ముందు చాలాసార్లు చెప్పానని.. వేరే భాషలో వెళ్లి పని చేయడంలో తప్పం లేదన్నారు.
వేరేవాళ్లు కూడా ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తారని.. అలా సమానమైన అవకాశాలు ఉంటే బాగుంటుంది ఈషారెబ్బ పేర్కొంది. వేరే భాషా ఇండస్ట్రీల్లో భాష తెలిసిన అమ్మాయిని కళ్లకు అద్దుకొని తీసుకుంటారని.. ఇతర భాషల్లో సైతం ఆడిషన్స్ ఇచ్చానన్నారు. కానీ, అక్కడ నాకు ఎంత వరకు భాష వస్తుందనే చూశారని.. మనకు భాష అస్సలు రాదనగానే మొహాలు మాడిపోతాయని చెప్పింది. భాష రాని అమ్మాయిని తీసుకుంటే కష్టమవుతుందని.. నేను మలయాళంలో ఒక సినిమా చేశానని.. అక్కడ ఇంకొక సినిమా చేయాలంటే భాష వచ్చినవారినే తీసుకుంటారని డైరెక్ట్‌గా చెప్పేస్తారని తెలిపింది.
తాను తమిళంలో మ్యానేజ్ చేస్తానని.. మలయాళం మాత్రం చాలా కష్టంగా అనిపించిందని పేర్కొంది. భాష వచ్చిన అమ్మాయిని తీసుకుంటే.. బాగుండేది అనే విషయం వాళ్ల మొహంలో అర్థమయ్యేది అంటూ టాలీవుడ్, మాలీవుడ్‌కు ఉన్న తేడాను చెప్పింది ఈశా రెబ్బ. హిందీలోనూ యాడ్ షూట్‌కు కూడా ఆడిషన్ చేయాలని.. తెలుగులో కొందరు దర్శకులు మాత్రమే యాడ్స్ ఆడిషన్స్ చేస్తారని చెప్పింది. చాలామంది అమ్మాయిలు వేరే భాషల నుంచి వచ్చి ఇక్కడ చాలా సినిమాలు చేసిన తర్వాత వాళ్ల భాషకు వెళ్లిపోతారని.. అక్కడే సెటిల్ అయిపోతారని.. వేరే భాషల్లో ఉన్నట్టు భాష తెలిసిన వాళ్లకే ప్రాధాన్యత ఇవ్వమని తాను అనడం లేదని.. సమ ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందని వివరించింది.