ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉత్కంఠ నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలలో నెలకొంది.
ఇండియా అంతా జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏపీలో ర్యాలీలు, ఉరేగింపులకు అనుమతులు రద్దు చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచా విక్రయాలపై కూడా నిషేధం విధించింది. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది..