Saturday, December 28, 2024
HomeAndhra PradeshElection Commission | ఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు.. కలెక్టర్‌, ఎస్పీలపై చర్యలు

Election Commission | ఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు.. కలెక్టర్‌, ఎస్పీలపై చర్యలు

Election Commission | ఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌ అయ్యింది. ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ గుప్తాల నుంచి వివరణ తీసుకున్నది. ఆ తర్వాత హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయని నిర్ధారించింది. దాడుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమైనట్లు నివేదిక అందిందని ఎన్నికల సంఘం పేర్కొంది. స్థానిక అధికారులు నిర్లక్ష్యం వహించినట్టు సీఎస్, డీజీపీ తెలిపారని చెప్పింది. ఈ క్రమంలో ఈసీ కఠిన చర్యలు చేపట్టింది. పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీలపై బదిలీ వేటు వేసింది.

పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణపై ఈసీ సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని 12 మంది సబార్డినేట్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. హింసాత్మక ఘటనలపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రతి కేసుపై సిట్ వేసి రెండ్రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. హింసాత్మక ఘటనలు జరిగిన చోట 25 కంపెనీల సాయుధ బలగాలను కొనసాగించాలని కేంద్ర హోంశాఖకు నిర్దేశించింది. లెక్కింపు పూర్తయిన 15 రోజుల తర్వాత కూడా బలగాలు కొనసాగించాలని ఎన్నికల సంఘం ఆదేశాల్లో స్పంష్టం చేసింది.

RELATED ARTICLES

తాజా వార్తలు