Sunday, December 29, 2024
HomeSportsENG vs AUS| సౌతాఫ్రికాని గ‌డ‌గ‌డ‌లాంచిన నెద‌ర్లాండ్స్.. మ‌రో విజ‌యం సాధించిన ఆస్ట్రేలియా

ENG vs AUS| సౌతాఫ్రికాని గ‌డ‌గ‌డ‌లాంచిన నెద‌ర్లాండ్స్.. మ‌రో విజ‌యం సాధించిన ఆస్ట్రేలియా

ENG vs AUS| టీ20 ప్రపంచకప్‌లో సంచ‌ల‌నాలు న‌మోద‌వుతున్నాయి. ప్ర‌తి మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద స్కోరులు న‌మోదైంది చాలా త‌క్కువ‌. అయితే ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జ‌ట్టు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 201 ప‌రుగులు చేసింది. ఇంగ్లండ్ ముందు 202 పరుగుల భారీ టార్గెట్ ఆస్ట్రేలియా సెట్ చేయ‌గా, ఆ ల‌క్ష్యాన్ని అందుకోలేక చ‌తికిల ప‌డింది ఇంగ్లండ్ జ‌ట్టు. ఈ క్ర‌మంలో ఇంగ్లండ్‌పై 36 ప‌రుగుల తేడాతో గెలుపొందింది ఆస్ట్రేలియా. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ విలువైన ప‌రుగులు చేశారు. ట్రావిస్ హెడ్ (18 బంతుల్లో 34 పరుగులు), డేవిడ్ వార్నర్ (16 బంతుల్లో 39 పరుగులు), మిచెల్ మార్ష్ (25 బంతుల్లో 35 పరుగులు), గ్లెన్ మాక్స్‌వెల్ (25 బంతుల్లో 28 పరుగులు), మార్కస్ స్టోయినిస్ (17 బంతుల్లో 30 పరుగులు) రాణించ‌డంతో 201 ప‌రుగులు చేయ‌గ‌లిగారు.

ఇక 202 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌తో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్ జ‌ట్టులో ఫిలిప్ సాల్ట్ (23 బంతుల్లో 37 ప‌రుగులు), జోస్ బట్లర్ (28 బంతుల్లో 42 పరుగులు), మొయిన్ అలీ (15 బంతుల్లో 25 పరుగులు), హ్యారీ బ్రూక్ (16 బంతుల్లో 20 పరుగులు నాటౌట్) మాత్ర‌మే రాణించారు.అయితే 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి 165 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగారు. దీంతో 36 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా త‌మ‌ రెండో విజయం సాధించింది. ఈ విజ‌యంతో గ్రూప్-బిలో నాలుగు పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. ఇక మ‌రో మ్యాచ్‌లో సౌతాఫ్రికా, నెద‌ర్లాండ్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 103 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో సైబ్రాండ్(45 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 40), లోగన్ వాన్ బీక్(22 బంతుల్లో 3 ఫోర్లతో 23) మాత్ర‌మే రాణించారు.

సౌతాఫ్రికా బౌలర్లలో ఓట్‌నెలి బార్ట్‌మన్(4/11) నాలుగు వికెట్లతో నెదర్లాండ్స్ పతనాన్ని శాసించగా.. అన్రిచ్ నోకియా(2), మార్కో జాన్సెన్(2/20) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక సౌతాఫ్రికా 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 106 పరుగులు చేసి గెలుపొందింది. అయితే ఆ ల‌క్ష్యాన్ని చేధించేందుకు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఆదిలోనే నాలుగు వికెట్స్ ప‌డిపోవ‌డంతో గెలుపు క‌ష్ట‌మే అనుకున్నారు. డేవిడ్ మిల్లర్( 59 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్(37 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 33) అసాధారణ ప్రదర్శన క‌న‌బ‌రిచి త‌మ జ‌ట్టుకి విజ‌యాన్ని అందించారు.. నెదర్లాండ్స్ బౌలర్లలో వివియన్(2/12) లోగాన్ వాన్ బీక్(2/21) రెండు వికెట్లు తీయగా.. బాస్ డీ లీడే ఓ వికెట్ పడగొట్టాడు.

RELATED ARTICLES

తాజా వార్తలు