Sunday, December 29, 2024
HomeTelanganaEtela Rajender | త‌క్కువ కాలంలో ప్ర‌జ‌ల నుంచి చీత్కారం అందుకున్న ఏకైక సీఎం రేవంత్‌:...

Etela Rajender | త‌క్కువ కాలంలో ప్ర‌జ‌ల నుంచి చీత్కారం అందుకున్న ఏకైక సీఎం రేవంత్‌: బీజేపీ నేత ఈట‌ల‌

హైద‌రాబాద్‌: అతిత‌క్కువ కాలంలో ప్ర‌జ‌ల నుంచి చీత్కారం అందుకున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని బీజేపీ నేత ఈటల రాజేంద‌ర్ (Etela Rajender) విమ‌ర్శించారు. త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ అక్ర‌మ డ‌బ్బులు వ‌సూలు చేసింది తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మని చెప్పారు. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ప్ర‌చారంలో భాగంగా వ‌రంగ‌ల్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఆర్ఆర్‌ టాక్స్ గురించి చెప్పారంటే ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఆవురావురమన్నట్టు ఉన్నారని.. ఎప్పటివరకు ఉంటామో తెలీదని అంతా సర్దుకొని పెట్టుకుంటున్నారని విమర్శించారు.

హైదరాబాద్‌లో బిల్డింగ్ అనుమ‌తుల‌కు కాంగ్రెస్ వాళ్లకు ప్ర‌త్యేకంగా ఫీజు కట్టకపోతే అనుమ‌తులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రజలు బిక్ష పెడితే సీఎం పదవి వచ్చిందన్న ఈటల.. అదే ప్రజలు దెబ్బకొడితే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిలు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని భువ‌న‌గిరి బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి బూర న‌ర్స‌య్య గౌడ్ డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వం రూ.7500 కోట్ల ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిలు విడుద‌ల చేయాల్సి ఉంద‌ని చెప్పారు. బ‌కాయిలు ఇవ్వ‌క‌పోవ‌డంతో విద్యార్థులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వెల్ల‌డించారు. కాలేజీల యాజ‌మాన్యాలు అడిగితే గ‌త ప్ర‌భుత్వాన్ని అడ‌గాల‌ని చెప్పార‌ని తెలిపారు. బీఆర్ఎస్ హ‌యాంలో జ‌రిగిన ప‌నుల‌కు ఈ ప్ర‌భుత్వం రూ.4 వేల కోట్ల బ‌కాయిలు విడుద‌ల చేసింద‌న్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుంటే సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు అంధకారమేనని చెప్పారు.

RELATED ARTICLES

తాజా వార్తలు