Click to view: JanaPadham_Main_Paper_TS_15-09-2024 EPaper
ఖైరతాబాద్ గణపతికి పూజలు నిర్వహించిన మాజీ మంత్రి హరీశ్ రావు, ఈ సందర్బంగా హరీశ్ రావు కామెంట్స్…
ప్రపంచంలోనే అతి పెద్ద ఖైరతాబాద్ గణేష్ మహరాజ్ ను సందర్శించుకోవడం సంతోషంగా ఉంది.
పూర్వజన్మ సుక్రుతంగా భావిస్తున్నాను. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చింది. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రమంతా ఇక్కడే ఉన్నట్లు ఉంది.
70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత నిర్వాహకులకు దక్కుతుంది.
వారిని కృషికి, ఇన్నేండ్లుగా ఘనంగా నిర్వహిస్తున్న వారికి నా ప్రత్యేక అభినందనలు.
భిన్నత్వంలో ఏకత్వం మన భారత సంస్కృతి. అవసరమైనప్పుడు అందరం ఒక్కటవుతాం
అన్ని పండుగలు సామూహికంగా సంతోషంగా కలిసి నిర్వహించుకుంటాం. అంత గొప్ప సంస్కృతి మనది.
భవిష్యత్తులోనూ ఇది కొనసాగించాలి. రాబోయే తరాలకు అందించాలి.
వినాయక చివితి అంటే డెవోషన్ మాత్రమే కాదు ఎమోషన్ కూడా ఉంది.
అందరి ఐకమత్యాన్ని చాటేందుకు బాల గంగాధర్ తిలక్ గారు స్వాతంత్ర్యోద్యమం సమయంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించారు.
అదే స్పూర్తిని ఇంకా కొనసాగిస్తున్నాం. రోబోయే రోజుల్లో కొనసాగిద్దాం.
మొన్నటి వర్షాలకు కొన్ని జిల్లాల్లో బీభత్సం జరిగింది. ఆ ప్రజలందరి కష్టాలు తొలగిపోవాలి.
రాష్ట్ర ప్రజందరి విఘ్నాలు తొలిగి, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ గణపతిని రెండు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను.
9 ఏండ్ల బిఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతి ఏటా గణష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాం.
ఇప్పుడు కూడా అదే పద్దతిలో నిమజ్జన కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.